జనవరిలో 11 రోజులు బ్యాంకులు బంద్; హాలిడేస్ లిస్ట్ ఇదే..

By Ashok kumar Sandra  |  First Published Jan 3, 2024, 9:06 PM IST

కొత్త సంవత్సరంలో ఏదైనా బ్యాంకు లావాదేవీలు చేయాల్సి వస్తే ఈ విషయం తెలుసుకోవాలి. ఏంటంటే జనవరిలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
 


చాలా మంది కొత్త సంవత్సరంలో ఆర్థిక విషయాలను ప్లాన్ చేసుకోవడంలో బిజీగా ఉంటుంటారు. ప్లానింగ్ అనేది పెట్టుబడుల నుండి కొత్త అకౌంట్ వరకు ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఏదైనా బ్యాంకు సంబంధిత లావాదేవీలు చేయాల్సి వస్తే ఒక్క విషయం తెలుసుకోవాలి. జనవరిలో మొత్తం 11 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు జనవరి సెలవుల లిస్ట్ విడుదల చేసింది. రిపబ్లిక్ డే కాకుండా ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు మూతపడతాయో లేదో తెలుసుకోండి... 

ప్రతి ఆదివారం, రెండవ ఇంకా నాల్గవ శనివారం సహా బ్యాంకులకు సెలవుల  ఉంటుంది. 

Latest Videos

జనవరి 2024 బ్యాంక్ హాలిడేస్  లిస్ట్:

- జనవరి 1 (సోమవారం): న్యూ ఇయర్ కాబట్టి హాలిడే

- జనవరి 11 (గురువారం): మిజోరంలో మిషనరీ డే  

- జనవరి 12 (శుక్రవారం): పశ్చిమ బెంగాల్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు

- జనవరి 13 (శనివారం): పంజాబ్ అండ్ ఇతర రాష్ట్రాల్లో భోగి వేడుక

- జనవరి 14 (ఆదివారం): మకర సంక్రాంతి 

- జనవరి 15 (సోమవారం): తమిళనాడు అండ్  ఆంధ్రప్రదేశ్‌లో పొంగల్ వేడుకలు, తమిళనాడులో తిరువల్లువర్ దినోత్సవం

- జనవరి 16 (మంగళవారం): పశ్చిమ బెంగాల్ ఇంకా  అస్సాంలో తుసు పూజ వేడుక

- జనవరి 17 (బుధవారం): అనేక రాష్ట్రాల్లో గురుగోవింద్ సింగ్ జయంతి వేడుకలు

- జనవరి 23 (మంగళవారం): సుభాష్ చంద్రబోస్ జయంతి 

- జనవరి 26 (శుక్రవారం): గణతంత్ర దినోత్సవం 

- జనవరి 31 (బుధవారం): అస్సాంలో మీ-డ్యామ్-మీ-ఫై వేడుక 

click me!