
7th Pay Commission: హోలీ వేడుకలకు ముందుగానే మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు (Central Government Employees) తీపివార్త అందించేందుకు సిద్ధం అవుతోంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరవు భత్యం లేదా డియర్‌నెస్ అలవెన్స్ (DA) ను ప్రభుత్వం పెంచబోతోంది. ఇది హోలీ (మార్చి 18) కంటే ముందే ప్రకటించవచ్చు. ఈ నిర్ణయంతో 50 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మందికి పైగా పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు.
డీఏ ఎంత పెంచవచ్చో తెలుసుకోండి
కేంద్ర ఉద్యోగులకు ప్రస్తుతం 31 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) లభిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, పారిశ్రామిక కార్మికులకు సంబంధించిన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI)డిసెంబర్ 2021 డేటాను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల డీఏను మూడు శాతం పెంచవచ్చు. దీంతో కేంద్ర ఉద్యోగులకు డీఏ 34 శాతం కానుంది.
ఈ తేదీన ప్రకటన రావచ్చు
దేశంలోని 5 రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ కూడా ముగియనుంది. ఆ తర్వాత డీఏ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. నివేదికల ప్రకారం, మార్చి 16, 2022న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) పెంచడానికి ఈ సమావేశంలో ప్రకటన చేయవచ్చు.
కేంద్ర ఉద్యోగులకు హోలీ కానుక
7వ వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం మార్చి 16న కేంద్ర ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటిస్తే.. హోలీకి ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం ఇచ్చే హోలీ కానుకగా నిలుస్తుంది. ఈసారి హోలీని మార్చి 18న దేశ వ్యాప్తంగా జరపనున్నారు.
డియర్‌నెస్ అలవెన్స్ (DA) అంటే ఏమిటి
ఏటా ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతుంటుంది. అటువంటి పరిస్థితిలో, కేంద్ర ఉద్యోగుల ఆదాయాన్ని పెంచడం కూడా అవసరం. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు DA ఇస్తుంది. బేసిక్ జీతం ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ లెక్కింపు జరుగుతుంది. సాధారణంగా, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జూలైలో డిఎ, డిఆర్(డియర్‌నెస్ రిలీఫ్) లకు సంబంధించిన ప్రయోజనాలను సవరిస్తుంది. నగరాల వారీగా ఉద్యోగుల డీఏలో తేడా ఉంటుంది.
DA ఇలా లెక్కిస్తారు.
కనీస ప్రాథమిక వేతనంపై ఇలా లెక్కవేస్తారు..
- ఉద్యోగి బేసిక్ సాలరీ: రూ. 18,000
- కొత్త DA (34%) రూ. 6120/నెలకు
- పాత DA ప్రకారం (31%) అయితే రూ. 5580/నెలకు
- ఎంత కరువు భత్యం (డీఏ) పెరిగింది 6120- 5580 = రూ 540/నెలకు
- వార్షిక వేతనం ఎంత పెరుగుతుందంటే 540X12 = రూ.6,480
గరిష్ట ప్రాథమిక ప్రాథమిక వేతనంపై ఇలా లెక్కిస్తారు...
ఉద్యోగి ప్రాథమిక వేతనం: రూ. 56900
- కొత్త DA (34%) రూ 19346 / నెల
- పాత DA ఇప్పటివరకు (31%) రూ 17639 / నెల
- ఎంత కరువు భత్యం (DA) పెరిగింది 19346-17639 = 1,707 రూ/నెలకు
- వార్షిక వేతనంలో పెరుగుదల 1,707 X12 = రూ. 20,484