మైక్రోసాఫ్ట్, నోకియా మరోసారి చేతులు కలపనున్నాయి...

By Sandra Ashok KumarFirst Published Nov 6, 2019, 6:23 PM IST
Highlights

క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో పరిశ్రమలలో కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ , ఫిన్నిష్ సంస్థతో చేతులు కలపనున్నట్టు ప్రకటించింది.

ఐదేళ్ల  క్రితం నోకియా స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని 7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి విఫలమైన తరువాత మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT) తో పరిశ్రమలలో  ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఫిన్నిష్ కంపెనీతో  ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్టు  ప్రకటించింది.
    

కొత్త భాగస్వామ్యంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సొల్యూషన్స్ మిషన్-క్రిటికల్ నెట్‌వర్కింగ్‌లో నోకియా యొక్క నైపుణ్యాన్ని, సంస్థలు మరియు కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్ (CSP) వారి బిజినెస్ అభివృద్ధికి సహాయపడుతుంది.

also read ఐదవ రోజు....పడిపోయిన పెట్రోల్ ధరలు


"ఇంటెలిజెంట్ క్లౌడ్ సొల్యూషన్స్‌లో మైక్రోసాఫ్ట్ యొక్క నైపుణ్యం, వ్యాపారం, మిషన్-క్రిటికల్ నెట్‌వర్క్‌లను నిర్మించడంలో నోకియా కలిసి కొత్త కనెక్టివిటీ, ఆటోమేషన్ దృశ్యాలను అన్లాక్ చేస్తుంది" అని మైక్రోసాఫ్ట్ అజూర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జాసన్ జాండర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నోకియా SD-WAN పరిష్కారాలను అనుసంధానించి నిర్వహించే సేవను తమ సంస్థ వినియోగదారులకు అందించే మొట్టమొదటి గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ BT అని  జాసన్ జాండర్ అన్నారు.


"పరిశ్రమలు, సేవా సంస్థల రెండింటికీ ఆర్థిక వృద్ధి, ఉత్పాదకతను పెంచే పరిశ్రమ 4.0 వైపు డిజిటల్  ప్రయాణాన్ని వేగవంతం చేస్తాము" అని నోకియా ఎంటర్ప్రైజ్ అధ్యక్షుడు, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ కాథరిన్ బువాక్ అన్నారు.

also read ఈజిట్? ఫెస్టివ్ సీజన్‌లోనూ తగ్గిన పసిడి దిగుమతులు!


నోకియా డిజిటల్ ఆటోమేషన్ క్లౌడ్ (నోకియా డిఎసి) 5 జి-రెడీ ఇండస్ట్రియల్-గ్రేడ్ ప్రైవేట్ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సొల్యూషన్ తో ఆన్-ప్రామిస్ మైక్రోసాఫ్ట్ అజూర్ ఎలిమెంట్స్‌ అనేక రకాల సురక్షిత పారిశ్రామిక ఆటోమేషన్ సోలుషన్స్ కు అనుమతిస్తుంది.


2014 లో మైక్రోసాఫ్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంది. తరువాత  సంస్థ వేలాది మంది ఉద్యోగులను తొలగించి స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని విడిచిపెట్టింది. 2016 లో మైక్రోసాఫ్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్ వ్యాపారాన్ని 350 మిలియన్ డాలర్లకు హెచ్‌ఎండి గ్లోబల్‌కు విక్రయించింది అయితే ఇది ఇప్పుడు నోకియా-బ్రాండెడ్ ఫోన్‌లను విక్రయిస్తుంది.
 

click me!