మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి కంపెనీలో దాదాపు ఏడేళ్ల పని తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. మహేశ్వరి రాజీనామా తర్వాత కంపెనీ ఇరినా ఘోష్‌ను ఎండీగా పదోన్నతి కల్పించింది.
మైక్రోసాఫ్ట్ ఇండియాకు కొత్త హెడ్ ఎంపిక జరిగింది. తాజాగా నవతేజ్ బాల్ మైక్రోసాఫ్ట్ ఇండియా కొత్త CEOగా నియమితులయ్యారు, అదే సమయంలో వెంకట్ కృష్ణన్ పబ్లిక్ సెక్టార్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి నిన్న రాజీనామా చేశారు. కాగా ప్రెసిడెంట్ రాజీనామాను కంపెనీ ధృవీకరించినట్లు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ల మధ్య మార్పుల్లో భాగంగా అనంత్ రాజీనామా చేశారు.
హనీవెల్, మెకెంజీ & కంపెనీ వంటి కంపెనీలలో పనిచేసిన అనంత్ 2016లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అనంత్ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. 1998లో ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ కూడా చేశారు. అనంత్ రాజీనామాతో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇరినా ఘోష్ మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మైక్రోసాఫ్ట్‌లో చేరడానికి ముందు, మహేశ్వరి హనీవెల్ ఇండియా ప్రెసిడెంట్ గా, మెకిన్సే & కంపెనీలో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా పనిచేశారు.
మైక్రోసాఫ్ట్ సీనియర్ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస రెడ్డి ఈ ఏడాది చివర్లో గూగుల్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆయన గతంలో ఆపిల్ ఇండియా రెగ్యులేటరీ టీమ్‌లో పనిచేశాడు. రెగ్యులేటరీ సవాళ్లను నావిగేట్ చేయడానికి ఆయన మార్పు Googleకి సహాయపడుతుందని భావిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్‌కి అనంత్ మహేశ్వరి ఎందుకు రాజీనామా చేశారు?
అనంత్ రాజీనామాపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ - కంపెనీ వెలుపల తన పాత్రను కొనసాగించడానికి అనంత్ మైక్రోసాఫ్ట్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని మేము ధృవీకరించగలమని అన్నారు. భారతదేశంలో మా వ్యాపారానికి అనంత్ చేసిన కృషికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అతని భవిష్యత్ ప్రయత్నాలలో ప్రతిదీ విజయం సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు.