కృత్రిమ మేధపై అల్టర్‌గా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి: సత్య నాదెళ్ల

By rajesh yFirst Published Dec 8, 2018, 10:31 AM IST
Highlights

కృత్రిమ మేధస్సు విషయంలో అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పిలుపునిచ్చారు. చైనా దీనిని దుర్వినియోగం చేస్తుందన్న వార్తల నేపథ్యంలో సత్య నాదెళ్ల వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకున్నది. వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో భేటీ జరిగిన తర్వాతే సత్య నాదెళ్ల ఈ ట్వీట్ చేశారు.

వాషింగ్టన్‌: కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంలో అప్రమత్తంగానూ, బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పిలుపునిచ్చారు. కొన్ని వర్గాలను గుర్తించేందుకు ప్రభుత్వం కట్టింగ్‌ ఎడ్జ్‌ పరిజ్ఞానాన్ని వినియోగించడంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో నాదెళ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 


అల్ప సంఖ్యాక వర్గాల అణచివేతకు చైనా ప్రభుత్వం కృత్రిమ మేధ (ముఖ్యంగా ముఖ గుర్తింపు టెక్నాలజీ)ను వినియోగించడంపై అమెరికా, అంతర్జాతీయంగా పౌర సంఘాల సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ‘కృత్రిమ మేధస్సు వినియోగం పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. దీని దుర్వినియోగాన్ని నిరోధించాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని నాదెళ్ల ట్వీట్‌ చేశారు.

వైట్‌ హౌస్‌లో జరిగిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ల సదస్సులో పాల్గొన్న నాదెళ్ల తర్వాత ఈ ట్వీట్‌ చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరైన ఈ సదస్సులో కృత్రిమ మేధపై చర్చ జరిగినట్లు సమాచారం. కృత్రిమ మేధను మంచికి ఎలా వినియోగించో చూశామని, ఈ పరిజ్ఞానం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

కోటక్‌ మహీంద్రాలో ఇక ‘వాట్సప్‌’ బ్యాంకింగ్‌ సేవలు
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌తో బ్యాంక్‌ ఖాతా, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల సమస్యలను పరిష్కరించనున్నట్టు పేర్కొంది. సారస్వత్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ కూడా వాట్సప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కో ఆపరేటివ్‌ బ్యాంకింగ్‌ రంగంలో ఇలాంటి సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్‌ సారస్వత్‌ కావడం విశేషం. బ్యాంకింగ్‌ ఆన్‌ వాట్సప్‌ సర్వీస్‌ ద్వారా కస్టమర్లు టెక్ట్స్‌ మెసేజ్‌లకు బదులుగా నోటిఫికేషన్లను పొందుతారు.

click me!