మెటా సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సిబ్బందికి ఒక ప్రకటనలో, "మేము 16 వారాల బేసిక్ వేతనం, ప్రతి సంవత్సరం సర్వీస్‌కు రెండు అదనపు వారాల పాటు అందిస్తాము. ఉద్యోగులకు అలాగే వారి కుటుంబానికి ఆరు నెలల పాటు ఆరోగ్య సంరక్షణ ఖర్చు, ఏదైనా లెఫ్ట్ ఓవర్ పిటిఓ (పెయిడ్ టైమ్ ఆఫ్) సమయంతో పాటుగా సంస్థ భరిస్తుందని ఆయన చెప్పారు.
ఈ సంవత్సరంలో అతిపెద్ద టెక్ లేఆఫ్‌లలో ఒకటైన ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా బుధవారం కంపెనీ ఉద్యోగుల తొలగింపులను ధృవీకరించింది. కంపెనీ బిజినెస్ కారణంగా 13శాతం వర్క్ ఫోర్స్ తగ్గించేందుకు అంటే 11,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించెందుకు ఈ నిర్ణయం వచ్చిందని తెలిపింది.
మెటా సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సిబ్బందికి ఒక ప్రకటనలో, "మేము 16 వారాల బేసిక్ వేతనం, ప్రతి సంవత్సరం సర్వీస్‌కు రెండు అదనపు వారాల పాటు అందిస్తాము. ఉద్యోగులకు అలాగే వారి కుటుంబానికి ఆరు నెలల పాటు ఆరోగ్య సంరక్షణ ఖర్చు, ఏదైనా లెఫ్ట్ ఓవర్ పిటిఓ (పెయిడ్ టైమ్ ఆఫ్) సమయంతో పాటుగా సంస్థ భరిస్తుందని ఆయన చెప్పారు.
undefined
"మేము ఎక్స్టార్నల్ వెండర్ తో మూడు నెలల కెరీర్ సపోర్టును అందిస్తాము, ఇందులో ఆన్ పబ్లిషెడ్ జాబ్ లీడ్స్‌కు ముందస్తు యాక్సెస్ ఉంటుంది" అని అతను చెప్పాడు.
వీసా గురించి మాట్లాడుతూ సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ టెర్మినేషన్ ముందు నోటీసు పీరియడ్ ఇంకా కొన్ని వీసా గ్రేస్ పీరియడ్స్ ఉందని, అంటే ప్రతి ఒక్కరూ వారి ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ద్వారా పని చేయడానికి అలాగే ప్లాన్స్ రూపొందించుకోవడానికి టైం ఉంటుందని చెప్పారు. "మీకు, మీ కుటుంబానికి ఏం అవసరమో దాని ఆధారంగా మీకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడటానికి మా అంకితమైన ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఉన్నారు" అని తెలిపారు.
నిరుత్సాహకర ఆదాయాలు, రాబడి తగ్గుదల తర్వాత మెటాలో ఖర్చులను తగ్గించే ప్రణాళికలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు వచ్చాయి. సిబ్బంది తగ్గింపు డిజిటల్ అడ్వర్టైజింగ్ రాబడిలో తీవ్ర క్షీణతకు కారణం, ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున కొట్టుమిట్టాడుతోంది. టెస్లా సిఈఓ ఎలోన్ మస్క్ కొత్త యాజమాన్యంలోని మరో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఖర్చులను తగ్గించుకోవడానికి 50 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ చర్య వచ్చింది.