అప్పుడు ట్విట్టర్ ఇప్పుడు ఫేస్‌బుక్.. భారీగా ఉద్యోగుల తొలగింపు.. వెల్లడించిన సి‌ఈ‌ఓ..

By asianet news teluguFirst Published Nov 10, 2022, 10:43 AM IST
Highlights

 ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగింపును ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం వెల్లడించారు. దీనిపై జుకర్‌బర్గ్ వివరణ ఇస్తూ.. కంపెనీలో ఇది అత్యంత కఠినమైన నిర్ణయమని అన్నారు. 
 

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం కంపెనీ ఉద్యోగుల తొలగింపులను ప్రకటించారు. వర్క్ ఫోర్స్ ని దాదాపు 13% తగ్గించుకోవడానికి 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.  ఈ చర్యకు ఉద్యోగులకు క్షమాపణలు కూడా చెప్పారు.

 మార్క్   జుకర్‌బర్గ్ ఉద్యోగులకు రాసిన లేఖలో "ఈ రోజు మెటా చరిత్రలో మేము చేసిన కొన్ని క్లిష్టమైన మార్పులను  మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మా టీం సైజ్ 13% తగ్గించాలని ఇందుకు 11,000 కంటే ఎక్కువ మంది ప్రతిభావంతులైన ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్నాను. ఖర్చులను తగ్గింపు ఇంకా Q1 ద్వారా మా నియమకాలను స్తంబించడం ద్వారా మరింత సమర్థవంతమైన కంపెనీగా మారడానికి కంపెనీ  అదనపు చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ సిబ్బందికి ఒక ప్రకటనలో "మేము 16 వారాల బేసిక్ జీతం, ప్రతి సంవత్సరం సర్వీస్‌కు రెండు అదనపు వారాలను అందిస్తాము. ఉద్యోగులు అలాగే వారి కుటుంబాలకు ఆరు నెలల పాటు ఆరోగ్య సంరక్షణ ఖర్చు, ఏదైనా PTO (పెయిడ్ టైం ఆఫ్) సమయంతో పాటు సంస్థ కవర్ చేస్తుంది.

తొలగించిన ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్ సహాయాన్ని కూడా అందించింది. "మీరు వీసాపై ఇక్కడ ఉన్నట్లయితే ఇది చాలా కష్టమని నాకు తెలుసు. తొలగింపులు చేయడానికి ముందు నోటీసు పీరియడ్ ఇంకా కొన్ని వీసా గ్రేస్ పీరియడ్‌లు ఉంటాయి, అంటే ప్రతి ఒక్కరూ  ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ద్వారా  పని చేయడానికి  ఇంకా ప్లాన్స్ రూపొందించుకోవడానికి సమయం ఉంటుంది." అని అన్నారు.

తగ్గుతున్న ఆదాయాలు, టెక్నాలజీ పరిశ్రమలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఉద్యోగులకు రాసిన లేఖలో జుకర్ బర్గ్ పేర్కొన్నారు. ఆర్థిక మందగమనం, పెరిగిన పోటీ , తగ్గిన ప్రకటనల సంకేతాల కారణంగా మా ఆదాయాలు నేను ఊహించిన దాని కంటే చాలా తక్కువగా పడిపోయాయి అని అన్నారు.

click me!