సెలెబ్రిటీలు, అంబానీ ఫ్యామిలీకి మెహందీ డిజైన్ ఆర్టిస్ట్; ఆమె ఒక చెయ్యికి మెహేంది వేస్తే ఎంత తీసుకుంటుందంటే..

By asianet news telugu  |  First Published Nov 3, 2023, 5:55 PM IST

ధనవంతుల చేతికి మెహందీ వేస్తే ఎంత వసూలు చేస్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నీతా అంబానీ, ఇషా అంబానీ, శ్లోకా మెహతా, సోనమ్ కపూర్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, అలియా భట్, నటాషా దలాల్ మెహందీ ఆర్టిస్ట్ గురించి తెలుసా.. 
 


పెళ్లి, శుభకార్యాల వేడుకల సందర్భంగా ఎన్నో  వ్యాపార అవకాశాలు ఉంటాయి. బట్టల షాపింగ్ నుండి నగలు, మేకప్ వరకు డబ్బు ఖర్చు ఎక్కువ. ఈ వేడుకలలో మెహందీ ఆర్టిస్టులకు కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలంటి మెహేంది ఆర్టిస్ట్ అంబానీ కుటుంబానికి, బాలీవుడ్ తారలకు కూడా మెహందీ వేస్తారని మీకు తెలుసా..? ఎందుకంటే ఈమె క్లిష్టమైన డిజైన్లను కూడా అందంగా చేతిపై  మెహేందితో బంధిస్తుంది.

అయితే ఈ మెహందీ ఆర్టిస్ట్ ఎవరంటే.. వీణా నడ్గ. నీతా అంబానీ, ఇషా అంబానీ, శ్లోకా మెహతా, సోనమ్ కపూర్, దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, అలియా భట్ ఇంకా నటాషా దలాల్ కి మెహందీ వేసిన  వారిలో వీణా నడ్గా  ఒకరు. 

Latest Videos

ధనవంతుల చేతికి మెహందీ వేసే వీణ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వధువు చేతులకి మెహందీని వేయడం రూ. 3,000 నుండి రూ. 7,000 వరకు ఉంటుంది, అది కూడా రెండు చేతులు ఇంకా కాళ్లపై కూడా. ఇదిలా ఉండగా సాధారణ సమయాల్లో ఒక చేతికి  మెహేంది రూ.75, కాలుకు రూ.50 ఉంటుంది.

సెలబ్రిటీల పెళ్లిళ్లకు మెహేంది వేస్తే ఎలాంటి డబ్బులు వసూలు చేయబోమని వీణా స్పష్టం చేసింది. అది కూడా  వారికి నచ్చిన ప్రకారం నాకు చెల్లిస్తారు ఇంకా  ఎప్పుడు కూడా ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది, ”అని వీణా నగ్దా అన్నారు.

 వీణ నగ్దా  మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. చదువు పూర్తి కాకపోవడంతో చీరలకు ఎంబ్రాయిడరీ చేసి డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. తర్వాత మెహందీ వేయడం మొదలు పెట్టింది. మెహందీ డిజైన్‌లపై పట్టు సాధించాక పెద్ద పెద్ద పార్టీల్లో మెహందీ వేయడం మొదలుపెట్టారు. వీణ జీవితంలో ఇదే కీలక మలుపు. ఆ తర్వాత అంబానీ కుటుంబానికి ఆహ్వానం అందింది. ఆ తర్వాత, నటుడు సంజయ్ ఖాన్ కుమార్తె ఫరా ఖాన్ అలీ పెళ్లిలో మెహందీ వేసి గుర్తింపు పొందింది. అప్పుడు ఆమెని  సుసాన ఖాన్ అండ్  హృతిక్ రోషన్ల వివాహానికి ఆహ్వానించారు. అక్కడ ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్‌లకు పెళ్లికి ఆహ్వానం అందింది. కరిష్మా కపూర్, ఫర్హా ఖాన్ ఇంకా సయ్యద్ ఖాన్ వివాహాలలో కూడా ఆమె మెహందీ వేసింది. 

సోనమ్ కపూర్ తల్లి సునీతా కపూర్ ప్రతి సంవత్సరం కర్వా చౌత్ సందర్భంగా మెహందీని వేయడానికి ఆమెని పిలుస్తారు. వీణా నగ్దా కభీ ఖుషీ కభీ గమ్, కల్ హో నా హో, హమ్ తుమ్, యే జవానీ హై దీవానీ ఇంకా తాజాగా  రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ అలాగే డ్రీమ్‌గర్ల్ 2 వంటి సినిమాల్లో నటీనటులకు కూడా మెహందీ వెసింది. 

click me!