Adani Power Q2 Results:  Q2లో అదానీ పవర్ అదుర్స్...నికర లాభం 848 శాతం పెరుగుదల..ఆదాయం 84 శాతం వృద్ధి..

Published : Nov 02, 2023, 11:03 PM IST
Adani Power Q2 Results:  Q2లో అదానీ పవర్ అదుర్స్...నికర లాభం 848 శాతం పెరుగుదల..ఆదాయం 84 శాతం వృద్ధి..

సారాంశం

Adani Power Q2 Results: భారతదేశపు బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్, 2024 రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో, థర్మల్ పవర్ కంపెనీ నికర లాభం దాదాపు 10 రెట్లు పెరిగిందని తెలిపింది. అదానీ పవర్ లిమిటెడ్ గురువారం సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో రూ.6,594 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Adani Power Q2 Results: గురువారం అదానీ పవర్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 9 రెట్లు పెరిగి రూ.6,594 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదానీ పవర్‌ కన్సాలిడేటెడ్ నికర లాభం 848 శాతం పెరిగి రూ.6,594 కోట్లకు చేరుకుందని కంపెనీ పేర్కొంది. ఏడాది క్రితం, 2022-23 ఇదే త్రైమాసికంలో జూలై-సెప్టెంబర్‌లో కంపెనీ నికర లాభం రూ.696 కోట్లుగా నమోదైంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం 61 శాతం పెరిగి రూ.12,155 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం రూ.7,534 కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉంటే కంపెనీకి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్  జార్ఖండ్‌లలో ఎనిమిది పవర్ ప్లాంట్లు ఉన్నాయి.

అదానీ పవర్ షేర్ వేల్యూ గురించి మాట్లాడితే, హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత కూడా అదానీ పవర్ తన ఆధిపత్యం నిలుపుకుంది. ఇది మాత్రమే కాదు, కంపెనీ షేర్లు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. హిండెన్‌బర్గ్ సోషల్ మీడియాలో అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా నివేదికను ప్రచురించిన 24 జనవరి 2023. రోజున, అదానీ పవర్ షేర్ల విలువ  రూ.275 వద్ద ఉండగా.  ఆ తర్వాత అదానీ గ్రూప్‌కు చెందిన అన్ని కంపెనీల షేర్లు పడిపోవడంతో పాటు అదానీ పవర్ సెంటిమెంట్ కూడా దిగజారింది. తర్వాతి రోజుల్లో షేరు రూ.132.40 కనిష్ట స్థాయికి పడిపోయింది. 

ఫిబ్రవరిలో అదానీ పవర్ షేర్లు రూ. 132.40 కనిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత మళ్లీ ఊపందుకున్నాయి. ఆపై వెనక్కి తిరిగి చూసుకోలేదు. 52 వారాల గరిష్ట షేర్ ధర రూ.409 వద్ద నమోదవగా, గురువారం షేరు ధర రూ.393 స్థాయిని తాకింది. అయితే ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఈ షేరు 2 శాతం పెరిగి రూ.372.75 వద్ద ముగిసింది. అంటే షేరు జనవరి 24  రోజు ధర కంటే రూ.100 ఎక్కువగా ట్రేడవుతోంది. దీన్ని బట్టి హిండెన్‌బర్గ్ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపలేదని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్