నందిగామలో మేఘా సిఎన్‌జి గ్యాస్ సేవలు ప్రారంభం.. త్వరలో మరిన్ని ప్రాంతాలకు..

By asianet news teluguFirst Published Jul 19, 2021, 6:54 PM IST
Highlights

తక్కువ ఖర్చుతో  వాహన దారులు ఎక్కువ దూరం ప్రయాణించేందుకు మేఘా సి‌ఎన్‌జి  గ్యాస్ సేవలను నేడు టెక్నికల్ ఇంచార్జి  రాజ్ కుమార్ ప్రారంభించారు.

విజయవాడ, జూలై 19:  కృష్ణా జిల్లా నందిగామ లో సోమవారం నుంచి మేఘా  గ్యాస్ సేవలు ఆరంభమయ్యాయి. పట్టణంలోని జాతీయ రహదారి వద్దగల  భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కు చెందిన శ్రీ బాలాజీ భారత్  ఫిల్లింగ్ స్టేషన్ లో  మేఘా గ్యాస్ సిఎన్‌జి  విక్రయాలను మేఘా గ్యాస్   టెక్నికల్ ఇంచార్జి  రాజ్ కుమార్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మేఘా గ్యాస్ ప్రతినిధులు శర్మ, రామకృష్ణ, ఫిల్లింగ్ స్టేషన్ యజమాని రోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ   మేఘా గ్యాస్ సేవలను విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు.

త్వరలో కృష్ణ జిల్లా లోని గుణదల, గుడివాడ, జగ్గయ్యపేట తో పాటు మరికొన్ని కేంద్రాల్లో మేఘా గ్యాస్  సిఎన్‌జి   విక్రయాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.  

also read గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలోకి రిలయన్స్.. రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచన..

కృష్ణా జిల్లాలో  ఇప్పటికే కానూరు, విజయవాడ పండిట్ నెహ్రు బస్సు స్టేషన్, జగ్గయ్యపేట, గుడివాడ, విద్యాధరపురం తదితర ప్రాంతాల్లో తాము గ్యాస్ విక్రయాలు చేస్తున్నామని తెలిపారు. తక్కువ ఖర్చుతో  వాహన దారులు ఎక్కువ దూరం ప్రయాణించేందుకు సిఎన్‌జి ఎంతో  ఉపయోగపడుతుందన్నారు.  

ఇట్స్ స్మార్ట్ ఇట్స్ గుడ్ అనే ట్యాగ్ లైన్ తో తాము సిఎన్‌జి  వినియోగదారులకు కార్డులు జారీ చేస్తున్నామని వాటిని వినియోగించి రాయితీతో  సిఎన్‌జి గ్యాస్ కొనుగోలు చేయొచ్చు అని చెప్పారు.
 

click me!