చైనా వల్లే ఇండియాలో ఇ-విటారా లాంచ్ ఆలస్యం: స్టాక్ మార్కెట్‌‌లోనూ నష్టాలే.. చైనా ఏం చేసిందంటే..

Published : Jun 12, 2025, 11:40 AM IST
చైనా వల్లే ఇండియాలో ఇ-విటారా లాంచ్ ఆలస్యం:  స్టాక్ మార్కెట్‌‌లోనూ నష్టాలే.. చైనా ఏం చేసిందంటే..

సారాంశం

అందరూ ఎదురుచూస్తున్న మారుతి సుజుకి ఇ-విటారా ఎలక్ట్రిక్ SUV లాంచ్ ఆలస్యం అవుతుందన్న వార్త స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. జూన్ 11న దాని షేర్లు దాదాపు 1% పడిపోయాయి. దీనికి కారణం చైనా తీసుకున్న నిర్ణయం. ఏం చేసిందో వివరంగా తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి బ్రాండ్ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. స్టాండర్డ్ కార్లని, రీసేల్ వాల్యూ ఎక్కువన్న కారణంగా ఎక్కువ మంది మారుతి సుజుకి కార్లు కొనేందుకు ఇష్టపడతారు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా కంపెనీ కూాడా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ని మార్కెట్ లోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే కొత్తగా ఇ-విటారా ఎలక్ట్రిక్ SUVని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది అనుకున్న సమయానికి లాంచ్ అవడానికి చైనా అడ్డంకిగా మారింది. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ కార్ల తయారీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. చైనా ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఖనిజాల ఎగుమతిపై చైనా ఆంక్షలు

చైనా అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు పెట్టడం వల్ల మారుతి సుజుకి ఇ-విటారా ఎలక్ట్రిక్ SUV లాంచ్ ఆలస్యం అవుతోంది. దీనివల్ల 2026 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యం తగ్గింది.

ఇ-విటారా ఎలక్ట్రిక్ SUV లాంచ్ ఆలస్యం అవుతుందన్న వార్త స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. జూన్ 11న దాని షేర్లు దాదాపు 1% పడిపోయి రూ.12,427కి చేరుకున్నాయి. చైనా ప్రభుత్వం అరుదైన భూమి ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించడమే ఈ పతనానికి కారణం.

చైనా ఎందుకిలా చేసింది?

అమెరికా వాణిజ్య ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా చైనా ఈ చర్య తీసుకుంది. ఈ ఆంక్షల వల్ల మారుతి EV ఉత్పత్తికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల కొరత ఏర్పడింది. దీంతో ఇ-విటారా ఉత్పత్తి లక్ష్యాలు మూడింట రెండు వంతులు తగ్గాయి.

EV ఉత్పత్తి లక్ష్యం తగ్గింపు

2026 ఆర్థిక సంవత్సరానికి ఇ-విటారా EV ఉత్పత్తి లక్ష్యం 88,000 యూనిట్ల నుండి 67,000 యూనిట్లకు తగ్గించారు. సెప్టెంబర్‌లో 26,500 వాహనాలు ఉత్పత్తి చేయాలని అనుకున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అది కేవలం 8,200 యూనిట్లకే పరిమితం అయ్యింది.

జపాన్, యూరప్ లో లాంచ్ కు ఓకే..

మారుతి EV విప్లవానికి ప్రతీక అయిన ఇ-విటారా SUV, ఇండియాలో లాంచ్ కాకముందే జపాన్, యూరప్ మార్కెట్లలోకి వస్తుంది. మన దేశంలో లాంచ్ ఆలస్యం అయినా కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.

బైక్ కంపెనీలకూ ఇబ్బందే

మారుతితో పాటు బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీలు కూడా ఈ అరుదైన ఖనిజాల కొరత గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగంపైనే ఎఫెక్ట్ చూపేలా ఉంది. ఇది ఎంత దూరం వెళ్తుందోనని కార్ల కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !
Best Investment : బంగారం vs వెండి vs రాగి.. 2025లో ఏది కొంటే జాక్‌పాట్? నిపుణుల సీక్రెట్ ఇదే !