Stock Market: స్టాక్ మార్కెట్లలో సూపర్ రికవరీ, భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..జోష్ నింపిన రిలయన్స్

Published : Mar 22, 2022, 04:52 PM IST
Stock Market: స్టాక్ మార్కెట్లలో సూపర్ రికవరీ, భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..జోష్ నింపిన రిలయన్స్

సారాంశం

మంగళవారం ట్రేడింగ్‌ నష్టాలతో ప్రారంభమైనప్పటికీ,  మధ్యాహ్నం సెషన్‌లో మార్కెట్‌ లో బలమైన జంప్ కనిపించింది. మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 696 పాయింట్ల లాభంతో ముగియగా, నిఫ్టీ 197 పాయింట్ల లాభంతో ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్, ఐటీ స్టాక్స్ పెరగడంతో ఈరోజు మార్కెట్ లాభపడింది.  

స్టాక్ మార్కెట్లు నేడు రోలర్ కోస్టర్ రైడ్ తరహాలో కదిలాయి. ఉదయం సెషన్ లో భారీ నష్టాలతో కుదేలైన మార్కెట్లు, ఆ తర్వాత మాత్రం పుంజుకొని మార్కెట్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంక్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ర్యాలీతో  మంగళవారం బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీలు భారీ లాభాల్లో ముగిశాయి.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 696.81 పాయింట్లు, 1.22శాతం పెరిగి 57,989.30 వద్ద క్లోజవగా, నిఫ్టీ 197.90 పాయింట్లు, 1.16 శాతం లాభపడి 17,315.50 వద్ద క్లోజయ్యింది. దాదాపు 1573 షేర్లు పురోగమించగా, 1745 షేర్లు క్షీణించాయి,  99 షేర్లు ఎలాంటి మార్పు చెందలేదు.

నిఫ్టీలో టెక్ మహీంద్రా, బీపీసీఎల్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఓసీ టాప్ గెయినర్స్‌గా ఉండగా, హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, దివీస్ ల్యాబ్ నష్టపోయాయి.

ఐటీ, ఆటో, బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల సూచీలు 1 శాతం చొప్పున పుంజుకోగా, రియల్టీ సూచీ 1 శాతం క్షీణించింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్‌లో ముగిశాయి.

RIL షేర్లలో బలమైన కొనుగోళ్లు-
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడం నేటి మార్కెట్ పెరుగుదలకు దోహదపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నేడు 2.3 శాతానికి పైగా పెరిగాయి. అధిక వాల్యూమ్‌లతో దాదాపు 2 నెలల గరిష్టాన్ని తాకాయి. గత 9 ట్రేడింగ్ సెషన్లలో 7 ట్రేడింగ్ సెషన్లలో బలాన్ని ప్రదర్శిస్తున్న ఈ స్టాక్ ఈ కాలంలో దాదాపు 13 శాతం లాభపడింది.

మార్కెట్ల గమనంపై ఈక్విటీ 99 సంస్థకు చెందిన ఎనలిస్ట్ రాహుల్ శర్మ స్పందిస్తూ... రిలయన్స్. హెచ్‌డిఎఫ్‌సి షేర్ల కొనుగోళ్ల ద్వారా మార్కెట్‌లు దిగువ స్థాయి నుంచి పుంజుకున్నాయని తెలిపారు. ఉదయం పతనం తర్వాత మార్కెట్ కోలుకోవడం  మార్కెట్‌లకు శుభసూచకం.అని తెలిపారు. 

అలాగే రాబోయే రోజుల్లో రష్యా మరియు ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ పరిస్థితులు,  క్రూడ్ ధర స్థిరీకరించబడే వరకు అస్థిరత కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనా 4వ వేవ్‌ను చూడగలం అని, ఇటీవలి కాలంలో పెరుగుతున్న COVID-19 కేసుల సంఖ్యను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాల్సి ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తగినంత లిక్విడిటీని ఉంచుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. 

Nifty 50 17280 బ్రేకింగ్‌లో చాలా బలమైన మద్దతుగా పని చేస్తుంది, ఇది మనం 17200 స్థాయిలను చూడవచ్చు. ఈ స్థాయిని ఉల్లంఘిస్తే తదుపరి స్టాప్ 17120 స్థాయిలకు చేరుకుంటుంది. ఎగువ భాగంలో 17350 చాలా బలమైన నిరోధంగా పనిచేస్తుంది, నిఫ్టీ ఈ స్థాయిలను దాటితే, మనం 17455 నుండి 17550 స్థాయిలను చూడవచ్చని తెలిపారు. 

అలాగే శ్రీకాంత్ చౌహాన్, ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్), కోటక్ సెక్యూరిటీస్ హెడ్ మాట్లాడుతూ, ఆసియా, యూరోపియన్ మార్కెట్లలోని  సానుకూల ధోరణి స్థానిక మార్కెట్లకు ప్రధానంగా ప్రోత్సాహాన్ని అందించిందని తెలిపారు. మార్కెట్లో రికవరీ బలంగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని, ఇన్వెస్టర్లు తదుపరి కొన్ని సెషన్‌లలో మరింత పదునైన అమ్మకాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.పెరుగుతున్న US బాండ్ యీల్డింగ్స్ , ముడిచమురు ధరల పెరుగుదల మార్కెట్లను అశాంతికి గురి చేస్తుందని అంచనా వేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Low Budget Phones: రూ.10,000లోపు వచ్చే అద్భుతమైన 5G ఫోన్లు ఇవిగో
Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?