
ఆదాయపు పన్ను దాఖలుకు చివరి తేదీ సమీపిస్తోంది. మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయకుంటే చివరి తేదీ 31 మార్చి 2022అని తెలుసుకోండి. అంటే, ఈ వ్యవధిలోగా మీరు పెనాల్టీతో రిటర్న్ దాఖలు చేయవచ్చు. మీరు ITR ఫైల్ చేసి, ఇప్పటి వరకు రీఫండ్ పొందకపోతే, దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఈ సమస్యలకు ముఖ్యమైన కారణం గురించి మీకోసం. దీనితో పాటు, మీరు కేవలం మూడు దశల్లో మీ రిటర్న్ స్టాటస్ ఎలా సులభంగా చెక్ చేసుకోవచ్చో కూడా తెలుసుకోండి...
ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్‌సైట్ రాకతో, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం చాలా సులభమైంది. దీంతో పేపర్ వర్క్ సమస్య పూర్తిగా తొలగిపోనుంది. మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎంత త్వరగా ఫైల్ చేస్తే, అంత త్వరగా మీ రిటర్న్ మీకు అందుతుంది కాబట్టి, పన్ను చెల్లింపుదారులు సమయానికి ITR ఫైల్ చేయాలని సలహా ఇస్తుంటారు. గతంలో CBDT విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే, ఇప్పటివరకు 6.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారు. ఇందులో 4.5 కోట్ల మంది రిటర్న్ పొందారు. మీకు కూడా రిటర్న్ రాకపోతే, కొన్ని ముఖ్యమైన కారణాలు ఉండవచ్చు, వాటి గురించి తెలుసుకోండి..
సాంకేతిక లోపం: ఆదాయపు పన్ను శాఖ జూన్ 2021లో కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది, ఆ తర్వాత చాలా రోజులపాటు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. ప్రజలు కూడా సోషల్ మీడియాలో ఈ సమస్య గురించి సమాచారాన్ని పంచుకున్నారు. ఇలాంటి సాంకేతిక సమస్య కారణంగా, మీ ITR రీఫండ్ కూడా నిలిచిపోవచ్చని గమనించండి.
డాక్యుమెంట్స్ లేకపోవడం : అదనపు డాక్యుమెంట్స్ లేకపోవడం కూడా రిటర్న్ పొందడంలో జాప్యానికి ప్రధాన కారణం కావచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి, మీరు పన్ను అధికారితో మాట్లాడవచ్చు లేదా అవసరమైన డాక్యుమెంట్స్ మళ్లీ సమర్పించవచ్చు.
నాన్ వెరిఫికేషన్: రీఫండ్ రాకపోవడానికి ఒక కారణం వెరిఫికేషన్. మీ ITR నిర్ణీత గడువులోపు ధృవీకరించకపోతే, అది చెల్లనిదిగా పరిగణించబడుతుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, ధృవీకరించని ITRలు చెల్లవు.
బ్యాంక్ వివరాలు: బ్యాంక్ వివరాలలో ఏదైనా మార్పు ఉన్నప్పటికీ, మీ రిటర్న్ పొందడంలో ఆలస్యం కావచ్చు. మీ ప్రాథమిక ఖాతాకు సంబంధించిన మొబైల్ నంబర్, ఇ-మెయిల్ వంటి సమాచారం కొత్త ఖాతా నుండి అందుకుంటూ ఉంటే మాత్రమే ఖాతా చెల్లుబాటు అవుతుంది. సమాచారం మార్చబడితే పోర్టల్‌లో హెచ్చరిక కనిపిస్తుంది.
మీ రీటర్న్ స్టేటస్ ఎలా చేయాలంటే..
మొదట యూజర్ ఐడి పాస్‌వర్డ్ ఉపయోగించి ఆదాయపు పన్ను పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
మై అక్కౌంట్ కు వెళ్లి, 'రిటర్న్/డిమాండ్ స్టేటస్'పై క్లిక్ చేయండి.
ఇప్పుడు పూర్తి సమాచారం మీ ముందుకు వస్తుంది. మీ రీఫండ్ అవ్వకపోతే, మీరు 'reason'కి వెళ్లి వెంటనే స్టేటస్ చెక్ చేయవచ్చు.