త్వరలోనే మేడిన్ ఇండియా గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఎంట్రీ...యాపిల్ తర్వాత భారత్ పై కన్నేసిన గూగుల్..

By Krishna Adithya  |  First Published Oct 19, 2023, 11:48 PM IST

యాపిల్ తర్వాత ఇప్పుడు గూగుల్ కూడా భారతదేశంలోనే స్మార్ట్ ఫోన్లను తయారు చేయనుంది. ఈ విషయాన్ని గూగుల్ గురువారం ప్రకటించింది. గూగుల్ తన పిక్సెల్ ఫోన్‌లను భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు తెలిపింది. 


స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. యాపిల్ తర్వాత ఇప్పుడు గూగుల్ కూడా భారత్ లోనే స్మార్ట్ ఫోన్లను తయారు చేయబోతోంది. ప్రముఖ ఇంటర్నెట్ కంపెనీ గూగుల్ తన పిక్సెల్ ఫోన్‌లను భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు గురువారం ప్రకటించింది. పిక్సెల్ ఫోన్‌లను భారతదేశంలోనే తయారు చేస్తామని, ఇందులో పిక్సెల్ 8ని కూడా 2024లో మార్కెట్‌లోకి విడుదల చేస్తామని గూగుల్ తెలిపింది. గ్లోబల్ తయారీదారుల భాగస్వామ్యంతో భారత్‌లో తయారీని ఏర్పాటు చేస్తామని గూగుల్ డివైజెస్ హెడ్ రిక్ ఓస్టర్ తెలిపారు.

మేక్ ఇన్ ఇండియా అడ్వాంటేజ్

Latest Videos

"స్థానిక డిమాండ్‌ను తీర్చడానికి ఇక్కడ ఉత్పత్తిని విస్తరించడానికి ఇది మొదటి అడుగు" అని ఓస్టర్‌లో తెలిపారు. ముఖ్యంగా గూగుల్ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో ఇది ఒక ప్రధాన ముందడుగని పేర్కొన్నారు. టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గూగుల్‌తో పాటు, ఆపిల్ ,  ఫాక్స్‌కాన్ వంటి ఇతర ఫోన్ తయారీ కంపెనీలు కూడా భారతదేశంలో మొబైల్ ఫోన్‌ల తయారీని ప్రారంభించాయి. సెప్టెంబరులో, ఆపిల్ ఐఫోన్ 15 ను భారతదేశంలో తయారు చేయబోతున్నట్లు ప్రకటించింది. చైనా ప్లస్ 1 వ్యూహం ప్రకారం, గ్లోబల్ కంపెనీలు భారతదేశంలో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. 

ఫాక్స్‌కాన్ భారతదేశంలో వేగంగా విస్తరిస్తోంది

తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారు, భారతదేశంలో తన ఉనికిని వేగంగా విస్తరించింది. కంపెనీ చైనాకు దూరం కావడానికి ప్రయత్నిస్తోంది. తమిళనాడులో ఫాక్స్‌కాన్‌కు ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీ ఇప్పటికే ఉంది. ఇందులో 40,000 మంది ఉపాధి పొందుతున్నారు. హన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) ఛైర్మన్, సిఇఒ యంగ్ లియు ముందుగా మాట్లాడుతూ, భవిష్యత్తులో తయారీ పరంగా భారతదేశం ముఖ్యమైన దేశంగా మారుతుందని అన్నారు. అదనంగా, భారతదేశం స్వావలంబన దిశగా చేస్తున్న ప్రయత్నాలు చైనా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా దేశాన్ని తయారు చేశాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. 

 

click me!