Air Asia CEO: ఎయిర్ ఏషియా సీఈవో వీడియో కాన్ఫరెన్స్ ఫోటో చూస్తే మతి పోవడం ఖాయం...ఇదేం దర్శనం రా బాబోయ్..

By Krishna Adithya  |  First Published Oct 19, 2023, 12:22 AM IST

ఏవియేషన్ కంపెనీ ఎయిర్ ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. దీనికి కారణం ఆయన మసాజ్ చేయించుకుంటున్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది  దావానంలా పాకింది. ఆ ఫోటోలో ఆయన మసాజ్ పొందుతున్నట్లు కనిపించారు. టోనీ ఫెర్నాండెజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్‌లో తాను చొక్కా లేకుండా ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. ఇది ప్రస్తుతం వివాదంగా మారింది. 


కంపెనీకి సంబంధించిన ఆన్ లైన్ మీటింగ్‌లో  పాల్గొనేటప్పుడు అందరూ  క్రమశిక్షణతో ఉంటారు, అది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ కావచ్చు. కానీ ఇండోనేషియాకు చెందిన ప్రతిష్టాత్మక విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ ఒకరు ఒంటి మీద బట్టల్లేకుండా మసాజ్ చేయించుకుంటూ మేనేజ్‌మెంట్ బోర్డు పిలిచిన సమావేశానికి హాజరయ్యారు. అయితే ఇంతకంటే విచిత్రం ఏంటంటే.. లింక్డ్‌ఇన్‌లో ఫోటోతో పాటు దీన్ని షేర్ చేసి తన సంస్థ పని వాతావరణం ఎంతో అందంగా ఉందంటూ పొగిడారు. కానీ నెటిజన్లు మాత్రం  మసాజ్ చేయించుకుంటూ సమావేశంలో పాల్గొన్న ఎయిర్ ఏషియా సీఈఓ చర్యను పలువురు విమర్శించారు. ఈ పోస్ట్ త్వరగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

లింక్డ్‌ఇన్‌లో AirAsia  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ టోనీ ఫెర్నాండెజ్ తన సంస్థ వర్క్ కల్చర్ పై తన గర్వాన్ని వ్యక్తం చేస్తూ తాను 'మీటింగ్ టైమ్ మసాజ్' అంటూ ఫోటోను షేర్ చేశారు. ఇండోనేషియా AirAsia సంస్కృతి నాకు పనితో పాటు మసాజ్ చేయించుకోవడానికి అనుమతిస్తుంది. రాబోయే కొద్ది రోజులు ఉత్కంఠగా సాగనున్నాయి. మేము నిర్మించిన దాని గురించి మేము గర్విస్తున్నాము. అంతిమ దృష్టిని మేము ఎన్నడూ కోల్పోలేదు,' అని ఆయన రాసుకొచ్చారు. 

Latest Videos

కానీ నెటిజన్లు మాత్రం చొక్కా లేకుండా సభకు హాజరై మసాజ్ చేయించుకుంటున్నారని, ఆయనను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని అభ్యర్థించారు. సీఈవో ఇలా చొక్కా లేకుండా ఆన్ లైన్ మీటింగ్ లో పాల్గొని మసాజ్ చేయించుకోవడం సరికాదని ఓ ప్రేక్షకుడు అన్నారు. అయితే అతడి లింక్డ్ ఇన్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి ఇలా రాసి ఉంటారని మరొకరు వ్యాఖ్యానించారు. పని సంస్కృతిని ప్రదర్శించడం సరైన పద్ధతి కాదని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌ ఏషియాలో మీకు ఇంత ఓపెన్ కల్చర్ ఉందని టోనీ చెప్పినప్పుడు నేను ఇంత ఓపెన్ అవుతానని ఊహించలేదని మరొకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

click me!