Petrol, diesel prices: వాహనదారులకు రిలీఫ్.. స్థిరంగా ఇంధన ధరలు.. లీటరుకు ఎంతంటే..?

Published : Jun 30, 2022, 09:40 AM IST
Petrol, diesel prices: వాహనదారులకు రిలీఫ్.. స్థిరంగా ఇంధన ధరలు.. లీటరుకు ఎంతంటే..?

సారాంశం

పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు ఉంటే  కొత్త ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నులు కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. 

నేడు జూన్ 30న వరుసగా 39వ రోజు దేశవ్యాప్తంగా ఇంధన ధరలను స్థిరంగా ఉండటంతో  పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు  లేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 21న పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు 8, డీజిల్‌పై లీటరుకు 6 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే.  


దేశంలోని ప్రముఖ నాలుగు మెట్రో నగరాల్లో ముంబైలో ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు ఉంటే  కొత్త ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నులు కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. 

బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 
 మరోవైపు, డబ్ల్యుటిఐ క్రూడ్ బుధవారం బ్యారెల్‌కు 109.5 డాలర్లకు పడిపోయింది అలాగే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 116 డాలర్లకు చేరుకుంది. మే 21న ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను కూడా తగ్గించాయి.  ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గింది.

ప్రముఖ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు

ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 111.35, డీజిల్ ధర లీటరుకు 97.28

ఢిల్లీలో  పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62

చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24

కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76

బెంగళూరులో పెట్రోలు లీటరుకు రూ. 101.94, డీజిల్ లీటరుకు రూ. 87.89

హైదరాబాద్‌లో  పెట్రోల్‌ లీటరుకు రూ.109.66, డీజిల్ రూ.97.82

PREV
click me!

Recommended Stories

Today Gold Rate: మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం..గ్రాము ఎంత పెరిగిందో తెలుసా?
Business Idea: ఏడాది పొడవునా తిరుగులేని బిజినెస్.. రూ. 10 వేలతో ప్రతీ నెలా రూ. 50 వేలు ఇలా సంపాదించవచ్చు.!