ప్రయాణంలో మీ ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా ? వెంటనే చేయవలసినది ఇదే..

By Ashok kumar Sandra  |  First Published Feb 19, 2024, 7:48 PM IST

 అనుకోకుండా  ఆధార్ కార్డు పోగొట్టుకుంటే చాలా విషయాలు తప్పవు. దీనికి UIDAI ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. పీవీసీ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని సిద్ధం చేసింది. 


దేశ పౌరుడికి ముఖ్యమైన గుర్తింపు డాక్యుమెంట్ ఆధార్ కార్డును పోగొట్టుకోవడం అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. ఎందుకంటే ఆధార్ కార్డ్ ప్రతిరోజు జీవితంలో చాలా ముఖ్యమైనది, ఎందుకంటే దీనిలో పౌరుడి గురించిన మొత్తం సమాచారం ఉంటుంది. అనుకోకుండా  ఆధార్ కార్డు పోగొట్టుకుంటే చాలా విషయాలు తప్పవు. దీనికి UIDAI ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. పీవీసీ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని సిద్ధం చేసింది. PVC ఆధార్ కార్డ్‌లో QR కోడ్, హోలోగ్రామ్, పేరు, ఫోటోగ్రాఫ్, పుట్టిన తేదీ ఇంకా  ఇతర సంబంధిత సమాచారం ఉంటుంది. రూ.50 ఛార్జ్  చెల్లించి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. PVC ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయడం కూడా సులభం.

ఆధార్ PVC కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

Latest Videos

undefined

* ,మొదట uidai.gov.in లింక్‌ని ఓపెన్ చేయండి 

* 'ఆర్డర్ ఆధార్ కార్డ్' అప్షన్ పై క్లిక్ చేయండి. 

* మీ 12-అంకెల ఆధార్ కార్డ్ (UID) నంబర్ / 16-అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ (VID) నంబర్ / 28-అంకెల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

* వెరిఫికేషన్  చేయండి  

* వన్ టైమ్ పాస్‌వర్డ్ 'OTP' జనరేట్ చేయండి 

* 'నిబంధనలు ఇంకా షరతులు' అంగీకరించండి

* OTPని ఎంటర్  చేయండి 

* ప్రింట్  చేసే ముందు మీ ఆధార్ కార్డ్ వివరాలను చెక్ చేయండి 

* క్రెడిట్ లేదా  డెబిట్ కార్డ్ ద్వారా రూ.50 (GST అండ్ పోస్టల్ ఛార్జీలతో సహా), UPI లేదా నెట్ బ్యాంకింగ్ చేయండి. 

* సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ SMS రూపంలో అందుతుంది. స్క్రీన్‌పై డిజిటల్ సిగ్నేచర్ రిసిప్ట్ కూడా పొందండి. 

* రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి. 
 

click me!