రిస్కు లేని పెట్టుబడి కోసం చూస్తున్నారా.. ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది..

By Krishna AdithyaFirst Published Dec 7, 2022, 12:34 PM IST
Highlights

ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) లో డబ్బు పెట్టాలని అనుకుంటున్నారా. అయితే  FD డిపాజిట్లపై ఓ బ్యాంకు 9 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

మీరు పెట్టుబడిలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) మీకు ఉత్తమ ఎంపిక. బ్యాంకులు FD రేట్లను ప్రస్తుతం బాగా పెంచాయి. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD డిపాజిట్లపై 9 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వివిధ పథకాలపై డబ్బును డిపాజిట్ చేస్తే మంచి వడ్డీని ఆఫర్ చేస్తోంది.

సీనియర్ సిటిజన్లకు 9 శాతం వడ్డీ:
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 181 రోజుల నుంచి 501 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 9 శాతం వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో, మిగితా కస్టమర్లకు ఈ కాలానికి 8.5 శాతం చొప్పున వడ్డీ అందచేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచిన తర్వాత, దేశంలోని అన్ని ప్రభుత్వ  ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచాయి. 

బల్క్ డిపాజిట్లపై 8 శాతం పైగా వడ్డీ:
ఇది కాకుండా, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బల్క్ డిపాజిట్లపై (రూ. 2 కోట్ల కంటే ఎక్కువ) ఆకర్షణీయమైన వడ్డీని కూడా అందిస్తోంది. బల్క్ డిపాజిట్లపై సంవత్సరానికి 8.10 శాతం వడ్డీ అందిస్తోంది. అయితే బల్క్ డిపాజిట్లపై ముందస్తు ఉపసంహరణ ఎంపిక లేదు. 

FDలపై ఎన్ని రోజులకు ఎంత వడ్డీ లభిస్తుందో తెలుసుకోండి:
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 15 నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.75శాతం  వడ్డీని అందిస్తోంది. ఎవరైనా 46 నుండి 60 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలో డబ్బు పెడితే, అతనికి 5.25శాతం  వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో, 61 నుండి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 5.50శాతం, 91 నుండి 180 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 5.75శాతం  చొప్పున వడ్డీ అందిస్తోంది.

సాధారణ కస్టమర్లకు 4.50 శాతం నుండి 8.50శాతం  వరకు వడ్డీ :
181 రోజుల నుండి 364 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై బ్యాంక్ సాధారణ కస్టమర్‌లకు 8.50 శాతం  వడ్డీని చెల్లిస్తోంది. అదే సమయంలో, అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 9 శాతం  వడ్డీని అందిస్తోంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు సంవత్సరానికి 4.50 శాతం  నుండి గరిష్టంగా 8.50 శాతం  వరకు వడ్డీని ఇస్తోంది.

click me!