థియేటర్లలో క్రికెట్ పండగ, ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లో టీ20 ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం..

Published : Oct 12, 2022, 11:48 AM IST
థియేటర్లలో క్రికెట్ పండగ, ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లో టీ20 ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం..

సారాంశం

ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ఐనాక్స్ బిగ్ స్క్రీన్ పై క్రికెట్ మ్యాచ్ లనూ చూసేందుకు అవకాశం కల్పిస్తోంది.  ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధమవుతోంది.   

ప్రపంచకప్ వచ్చిందంటే క్రీడాభిమానులకు పండగే,  ఎందుకంటే భారత్ పాకిస్తాన్ ఈ టోర్నీలో తలపడతాయి.  గత ఆసియా కప్ భారత్ రెండుసార్లు పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లు ఆడింది. ఈ రెండు మ్యాచ్ లకు వచ్చిన రెస్పాన్స్ అద్భుతం అనే చెప్పాలి. అయితే ఈ క్రేజ్ ను  క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ఐనాక్స్ ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ చైన్ కలిగివున్న ఐనాక్స్,  థియేటర్ స్క్రీన్లలో ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధమవుతోంది ఇందుకు సంబంధించి ఐసీసీతో, ఐనాక్స్ ఒప్పందం కుదుర్చుకోనుంది. 

ఈ నెల 16న ప్రారంభం కానున్న పురుషుల టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్ ఆడిన మ్యాచ్‌లను తమ మల్టీప్లెక్స్ స్క్రీన్‌లపై ప్రసారం చేసేందుకు దేశంలోని ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ సినిమా ఎగ్జిబిషన్ కంపెనీ ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఐనాక్స్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది.

దీనికి సంబందించిన సమాచారాన్ని INOX సంస్థ అధికారికంగా ప్రకటించింది  పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత్  ఆడే తన గ్రూప్ స్టేజ్ మ్యాచులు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌తో సహా టోర్నమెంట్‌లో గ్రూప్ స్టేజ్, సెమీ-ఫైనల్  ఫైనల్‌లో భారత్ ఆడబోయే అన్ని మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఐనాక్స్-ఐసిసి ఒప్పందంపై సంతకం చేసింది. 

భారతదేశ వ్యాప్తంగా 25 INOX థియేటర్లలో ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఐనాక్స్ లీజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనంద్ విశాల్ ఈ విషయాన్ని ప్రకటించారు. “భారత క్రికెట్ ప్రేమికులకు పెద్ద స్క్రీన్‌పై క్రికెట్‌ను వీక్షించడం  దాని సౌండ్ ఎఫెక్ట్‌లను భారీ స్థాయిలో అనుభవించడం వంటి ఆనందాన్ని అందించాలని ఐనాక్స్ నిర్ణయించింది.

అలాగే ప్రపంచకప్ టోర్నీలో బిగ్ స్క్రీన్‌పై క్రికెట్ చూసే అవకాశం రావడంతో థియేటర్‌లో క్రికెట్‌ని ఆస్వాదించడం మరింత ఆనందాన్ని ఇస్తుంది' అని ఆయన తెలిపారు. భారత్లోని మొత్తం 74 నగరాల్లో ఐనాక్స్  మల్టీప్లెక్స్ చైన్ ఉంది. 

బెంగళూరుతో సహా దేశవ్యాప్తంగా 74 నగరాల్లో ఐనాక్స్ 165 మల్టీప్లెక్స్‌లను కలిగి ఉంది, వాటిలో మొత్తం 705 స్క్రీన్‌లు కలిగి ఉన్నాయి. మొత్తం ఏకకాలంలో 1.57 లక్షల మంది ఈ క్రికెట్ మ్యాచ్ లను చూసే వీలుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఐనాక్స్  మరొక మల్టీప్లెక్స్ దిగ్గజం, PVR, ఒకదానితో ఒకటి విలీనాన్ని ప్రకటించాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు