లింక్డ్ఇన్ సి‌ఈ‌ఓ జెఫ్ వీనర్ రాజీనామా...

By Sandra Ashok Kumar  |  First Published Feb 6, 2020, 12:05 PM IST

లింక్డ్ఇన్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) జెఫ్ వీనర్ లింక్డ్ఇన్  సంస్థలో 11 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు తనకి  ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి రావడంతో తన ప్రస్తుత సి‌ఈ‌ఓ పదవికి రాజీనామా చేశారు.


సోషల్  నెట్వర్క్  దిగ్గజ కంపెనీ, మైక్రోసాఫ్ట్ సొంతమైన లింక్డ్‌ఇన్ సీఈవో జెఫ్ వీనర్(49) తన పదవికి రాజీనామా చేశారు. లింక్డ్ఇన్ సి‌ఈ‌ఓ జెఫ్ వీనర్ జూన్ 1  నుంచి కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ రోస్లాన్స్కీ జూన్ 1 నాటికి జెఫ్ వీనర్ స్థానంలో సి‌ఈ‌ఓ బాధ్యతలు చేపడ్తరు.   

also read వజ్రాలకు కరోనా వైరస్...వేల కోట్ల నష్టం!!

Latest Videos

లింక్డ్ఇన్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) జెఫ్ వీనర్ లింక్డ్ఇన్  సంస్థలో 11 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు తనకి  ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి రావడంతో తన ప్రస్తుత సి‌ఈ‌ఓ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన ర్యాన్ రోస్లాన్స్కీ జూన్ 1 న సిఇఒ అవుతారు అని మైక్రోసాఫ్ట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

"గత పదకొండు సంవత్సరాలు తన జీవితంలో గొప్ప వృత్తిపరమైన అనుభవాన్నందించాయని, మా సభ్యులు లేకుండా ఇది సాధ్యం కాదు, ఇందుకు లింక్డ్‌ఇన్‌ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు" అని వీనర్  అన్నారు. తన రాజీనామాని వీనర్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసిన ఉద్యోగులకు ఒక ఇమెయిల్‌లో తెలిపారు.

 also read ఫేస్‌బుక్ సీఓఓ నిశ్చితార్థం.. ఐదేళ్ల విరామం తర్వాత నవ్య జీవితంలోకి..


49 ఏళ్ల జెఫ్ వీనర్ 2008 లో లింక్డ్‌ఇన్ సంస్థలో బాధ్యతలు స్వీకరించారు.  ఆ సంవత్సరం తరువాత రోస్లాన్స్కీ  లింక్డ్‌ఇన్  కంపెనీలో చేరాడు.కాగా ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్‌ తొలిసారి  2011లో పబ్లిక్ ఆఫరింగ్ (స్టాక్)కు వచ్చింది తరువాత మైక్రోసాఫ్ట్ 2016లో లింక్డ్‌ఇన్ ని కొనుగోలు చేసింది.రోస్లాన్స్కీ 10 సంవత్సరాలకు పైగా లింక్డ్ఇన్లో పనిచేస్తు ఉన్నారు.

అతను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లకు రిపోర్ట్ చేసి మైక్రోసాఫ్ట్ సీనియర్ నాయకత్వ బృందంలో చేరనున్నారు. ప్రస్తుతం మార్కెటింగ్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ అయిన టోమర్ కోహెన్ రోస్లాన్స్కీ స్థానంలో ఉత్పత్తి అధిపతిగా నియమిస్తాడు.లింక్డ్ఇన్ ఆదాయం 12 నెలల్లో 78 బిలియన్ డాలర్ల నుండి 7.5 బిలియన్ డాలర్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. సంస్థ సభ్యులు 33 మిలియన్ల నుండి 675 మిలియన్లకు పైగా పెరిగింది.
 

click me!