లైఫ్ ఇన్సూరెన్స్ అంటే కుటుంబానికి రక్షణే కాదు, ఇది ఒక పొదుపు మార్గం కూడా. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ విశాల్ సుభర్‌వాల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు చెప్పారు.
లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకంగా కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం. మరో విధంగా చూస్తే ఇది ఒక పొదుపు సూత్రం కూడా. చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ కొనాలని ఆలోచిస్తున్నా, వారికి సరైన సలహా, సూచనలు దొరకవు. అలాంటి వారి కోసమే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, స్ట్రాటజీ, డిస్ట్రిబ్యూషన్, ప్లానింగ్, ఈ-కామర్స్ విభాగం గ్రూప్ హెడ్ విశాల్ సుభర్‌వాల్ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు.
1. ప్రతి ఒక్కరికీ వారి వారి హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ (హెచ్‌ఎల్‌వి) ఉంటుంది. దాన్ని లెక్కల ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మీ హెచ్‌ఎల్‌వి ఎంత ఉందో తెలుసుకొని, దానికి తగ్గట్టుగా జీవిత బీమాను కొనండి.
2. మీరు జీవితంలో ఏ దశలో ఉన్నారో ఒకసారి చూసుకోండి. అలాగే రిస్క్ తీసుకునే మీ సామర్థ్యం, మీకున్న ఆర్థిక లక్ష్యాలు మొదలైన వాటికి తగ్గట్టుగా జీవిత బీమా పథకాలను ఎంచుకోండి.
3. మీ అవసరాలకు తగ్గట్టు పాలసీ గడువు, ప్రీమియం ఎంత కట్టాలో నిర్ణయించుకోండి.
4. తక్కువ ధరకే వస్తుంది కదా అని ఏదో ఒక ప్లాన్ తీసుకోకండి. ఎందుకంటే ఆ ప్లాన్ మీకు సరిపోకపోవచ్చు అని గుర్తుంచుకోండి.
5. పాలసీ నిబంధనలు జాగ్రత్తగా చదవండి. షరతులు సరిగ్గా చూసుకోండి.
6. మంచి లాభాలు, రిస్క్ కవర్ ఇచ్చే యాడ్-ఆన్ రైడర్‌లను కూడా కొనండి.
7. అప్లికేషన్ ఫారమ్ నింపేటప్పుడు సరైన సమాచారం ఇవ్వండి. పూర్తి వివరాలు ఇవ్వండి.
8. మీ పాలసీకి నామినీ పేరు రాయడం మర్చిపోకండి. ఆ నామినీకి కూడా దాని గురించి తెలిసేలా చూడండి.
9. పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో ఈ-బీమా ఖాతాలో (ఈఐఏ) సేవ్ చేయండి.
10. పాలసీలు 30 రోజుల ఫ్రీలుక్ ఆఫర్‌తో వస్తాయి, ఆ విషయం కూడా గుర్తుంచుకోండి.