CCI Raids : మీడియా దిగ్గజాలకు చుక్కలు ... సిఈవోలకు నిద్రలేని రాత్రి!

భారతదేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు, ప్రకటనల ఏజెన్సీలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) సోదాలు నిర్వహించింది. ప్రకటనల ధరల అవకతవకలపై అనుమానంతో ఈ దాడులు జరిగాయి, దీనితో ఆయా సంస్థల సిఈవోలు నిద్రలేని రాత్రి గడిపారు.

CCI Raids Advertising Agencies and Broadcast Bodies Over Alleged Price Manipulation in telugu akp

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) దేశవ్యాప్తంగా పలు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, టాప్ బ్రాడ్‌కాస్టర్స్ బాడీ (ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ IBDF) కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. అడ్వర్టైజింగ్ ధరల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు అనుమానిస్తూ ఈ దాడులకు పాల్పడ్డారు. 

 గ్రూప్‌ఎమ్ (GroupM), పబ్లిసిస్ (Publicis), డెంట్సు (Dentsu), మాడిసన్ (Madison), ఇంటర్‌పబ్లిక్ గ్రూప్‌ (IPG)తో సహా పలు కంపెనీల కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగాయి.  ఇలా దేశ రాజధాని న్యూడిల్లి,గురుగ్రామ్ తో పాటు ఆర్థిక రాజధాని ముంబైలో ఈ సోదాలు కొనసాగాయి.  

Latest Videos

నిన్న మంగళవారం సాయంత్రం సిసిఐ అధికారులు ఒక్కసారిగా ఈ సోదాలు ప్రారంభించింది. రాత్రంతా సోదాలు కొనసాగాయి... ఇవాళ (బుధవారం) ఉదయానికి కానీ ముగియలేదు. ఇలా మీడియా దిగ్గజాలకు ఈ రాత్రి ఓ పీడకలను మిగిల్చింది.... ఆయా సంస్థల సిఈవోలు నిద్రలేని రాత్రి గడిపారు. ఈ ఏజన్సీల సీఈవోలను ఇవాళ ఉదయం తమ క్యాబిన్ లోకి అనుమతించారు కాంపిటిషన్ కమీషన్ ఆప్ ఇండియా. 

ఈ సోదాల్లో అడ్వర్టైజింగ్ ఏజన్సీలు, మీడియా సంస్థల కార్యాలయాల్లో ముఖ్యమైన డాటాను సిసిఐ అధికారులు సేకరించారు.  ఎలక్ట్రిక్ పరికరాలు, హార్డ్ డ్రైవ్ లను పరిశీలించారు. అధికారిక ఈమెయిల్స్ ను కూడా పరిశీలించారు. కాల్ డేటా, మెసేజ్ లను కూడా పరిశీలించారు. ఇలా సిసిఐ సోదాలతో ఆయా సంస్థల్లో గందరగోళం నెలకొంది.  
 
  ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (IBDF), అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAAI), మరియు ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ (ISA) కార్యనిర్వాహకులు అప్రమత్తంగా ఉండటంతో, దర్యాప్తు అధికారులు కార్యాలయ ప్రాంగణాలను త్వరగా సీజ్ చేసి, మొబైల్ ఫోన్‌లను జప్తు చేసి, ఇమెయిల్‌లు, ఆర్థిక రికార్డులు మరియు అంతర్గత సమాచారాలను తనిఖీ చేయడం ప్రారంభించారు.

అసలు సిసిఐ సోదాలు జరపడానికి కారణమేంటి :  
 

పలు అడ్వర్టైజింగ్, మీడియా సంస్థలు ప్రకటనల ధరలు, డిజిటల్ మీడియా ఖర్చులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇలా టెక్ దిగ్గజాలు డిజిటల్ ప్రకటనల్లో ఆధిపత్యం కోసం మీడియా ఏజెన్సీలతో కుమ్మక్కయ్యాయని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే సిసిఐ సోదాలు చేపట్టింది. 

అగ్రశ్రేణి అడ్వర్టైజింగ్ సంస్థలు ప్రకటన రేట్లను నిర్ణయించడానికి, న్యాయమైన డిస్కౌంట్లను తొలగించడానికి మరియు మార్కెట్‌ను మోసగించడానికి కుట్ర పన్నాయని ఆరోపణలున్నాయి. ఇన్నిరోజులు ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన CCI తాజాగా దాడులకు దిగింది.  
 
 ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (IBDF), అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAAI), ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ (ISA) సంస్థలు అప్రమత్తం అయ్యేలోపే దర్యాప్తు అధికారులు పలు కార్యాలయాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఉద్యోగుల మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇమెయిల్‌లు, ఆర్థిక రికార్డులు, అంతర్గత సమాచారాలను తనిఖీ చేయడం ప్రారంభించారు.

vuukle one pixel image
click me!