
ప్రతిఒక్కరూ ఉద్యోగానంతరం జీవితాన్ని మెరుగుపరచుకోవడం గురించి ఆందోళన చెందుతుంటారు. ఇటువంటి పరిస్థితిలో చాలా ముందుగానే రిటైర్మెంట్ తరువాత ఫ్యూచర్ ప్లాన్ చేస్తుంటారు. చాలా మంది వారి డబ్బును మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు, అయితే ఎక్కువగా భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ఏదైనా ప్రభుత్వ పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు.
అలాంటి ఒక ప్రత్యేక LIC పథకం గురించి మీకోసం..ఈ పథకం పేరు LIC సరల్ పెన్షన్ యోజన. ఈ LIC పథకంలో భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పెట్టుబడి పెడుతున్నారు. ఇది ఒక నాన్ లింక్డ్ సింగిల్ ప్రీమియం పథకం. ఇందులో మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత జీవితాంతం పెన్షన్ ప్రయోజనం పొందుతారు. మీరు LIC సరళ్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ స్కీమ్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి మీకోసం..
LIC సరళ్ పెన్షన్ ప్లాన్ రెండు ఆప్షన్స్ తో వస్తుంది. ఇందులో సింగిల్ అండ్ జాయింట్ లైఫ్ ఉన్నాయి. మీరు ఈ రెండు ఆప్షన్స్ లో దేనినైనా ఎంచుకోవచ్చు.
సింగిల్ లైఫ్ ఆప్షన్
సింగిల్ లైఫ్ గురించి మాట్లాడినట్లయితే, ఈ పెన్షన్ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే లింక్ చేయబడుతుంది. ఇందులో మీరు కొనుగోలు ధరలో 100% రిటర్న్‌తో లైఫ్ యాన్యుటీని పొందుతారు.
ఈ పథకం కింద, పెన్షన్ లబ్ధిదారుడు జీవించి ఉన్నంత వరకు అతను దాని ప్రయోజనాన్ని పొందుతూనే ఉంటాడు. మరణం తర్వాత పాలసీ తీసుకున్న బేస్ ప్రీమియం వారి నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది. అంతేకాకుండా, దానిలో మినహాయించిన పన్ను తిరిగి చెల్లించబడదు.
జాయింట్ లైఫ్ ఆప్షన్
ఈ ప్లాన్ కింద, మీరు మీ భార్యతో సహ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పెన్షన్ భార్యాభర్తలిద్దరితో ముడిపడి ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ చివరి వరకు జీవించి ఉన్నంతవరకు పెన్షన్ ప్రయోజనం పొందుతారు.
పెన్షనర్లు ఇద్దరూ చనిపోతే. ఈ సందర్భంలో నామినీకి బేస్ ధర ఇవ్వబడుతుంది. పాలసీదారుడు ప్రతి నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా సంవత్సరానికి ఒకసారి పెన్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో కనీస వార్షికాదాయం సంవత్సరానికి రూ. 12,000.
మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా రుణం తీసుకోవచ్చు. మీరు పాలసీని ప్రారంభించిన తేదీ నుండి 6 నెలల తర్వాత ఈ పాలసీని పొందవచ్చు. మరోవైపు, కస్టమర్ మరణిస్తే, కస్టమర్ జీవిత భాగస్వామి కూడా ఈ పథకం కింద రుణాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి, మీకు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మొబైల్ నంబర్ అవసరం.