తపాలాశాఖలో మదుపునకు ‘నవ’ సూత్రాలు..!!

First Published Jul 2, 2018, 5:25 PM IST
Highlights

జూన్ నెలతో ముగిసే త్రైమాసికంలో చిన్న మదుపు పథకాలతో వచ్చే వడ్డీరేట్లు, మార్చి నెలాఖరుతో ముగిసే త్రైమాసికంలోనూ చెల్లిస్తారు.

హైదరాబాద్: జూన్ నెలతో ముగిసే త్రైమాసికంలో చిన్న మదుపు పథకాలతో వచ్చే వడ్డీరేట్లు, మార్చి నెలాఖరుతో ముగిసే త్రైమాసికంలోనూ చెల్లిస్తారు. తపాలాశాఖ ఆఫర్ చేసిన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో దేశవ్యాప్తంగా ఎక్కడైనా మదుపు చేయడం మంచి ఆలోచన. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రతి త్రైమాసికంలోనూ చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేట్లు ఖరారవుతాయి. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో అమలులో ఉన్న వడ్డీరేట్లే మార్చిలోనూ కొనసాగుతాయి. తపాలాశాఖ ప్రస్తుతం తొమ్మిది చిన్న తరహా మదుపు పథకాలు అమలు చేస్తోంది. 

తపాలాశాఖ అమలు చేస్తున్న చిన్న మొత్తాల మదుపు పథకాలివి


పోస్టాఫీసు సేవింగ్స్ అక్కౌంట్, ఐదేళ్ల పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అక్కౌంట్ (ఆర్డీ), పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ అక్కౌంట్ (టీడీ), పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్ అక్కౌంట్ (ఎంఐఎస్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్సెస్), 15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అక్కౌంట్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (ఎన్ఎస్‌సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), సుకన్య సమ్రుద్ధి అక్కౌంట్స్.

ఐటీ చట్టం 80 సెక్షన్ కింద ఇలా పన్ను మినహాయింపు


ఈ పథకాల్లో దేనిలో మదుపు చేసినా ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు పొందేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఈ పథకాల్లో రూ.1.50 లక్షల వరకు మదుపు చేసేందుకు వీలు ఉన్నది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై indiapost.gov.in వెబ్‌సైట్ ప్రకారం తాజాగా తపాలాశాఖ ఆఫర్ చేస్తున్న వడ్డీరేట్లు ఇవి. 

పోస్టాఫీసు పొదుపు ఖాతాపై నాలుగు శాతం వడ్డీరేటు


ప్రతి ఒక్కరూ విడిగా గానీ, జాయింట్ అక్కౌంట్ ద్వారాగాని పోస్టాఫీస్ పొదుపు ఖాతాలో మదుపు చేస్తే నాలుగు శాతం వడ్డీరేటు లభిస్తుంది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో అమలు చేసిన వడ్డీరేట్లనే ఏడాది పొడవునా అమలు చేస్తుంది. 

ఆరు శాతం అందిస్తున్న ఐదేళ్ల ఫోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ ఖాతా  


ఐదేళ్ల గడువుతో కూడిన పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ ఖాతా (ఆర్డీ) ఏటా 6.9 శాతం వడ్డీరేటు అందిస్తున్నది. ఇది ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఉదాహరణకు రూ.10 పోస్టాఫీసులో డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ గడువు నాటికి అది రూ.717.43లకు చేరుతుంది. ఒకసారి రికరింగ్ డిపాజిట్ లో మదుపు చేసిన మొత్తాన్ని మదుపు గడువు ముగిసిన తర్వాత ఏయేటికాయేడు చొప్పున మరో ఐదేళ్లు పొడిగించొచ్చు. 

పోస్టాఫీసు టైం డిపాజిట్ ఖాతా (టీడీ) ఇలా 


పోస్టాఫీసు టైం డిపాజిట్ ఖాతా (టీడీ)పై వడ్డీరేట్లు ఏడాదికోసారి చెల్లిస్తారు. కానీ త్రైమాసికానికి ఒకసారి గణిస్తారు. ఈ పథకంలో మదుపు చేసిన మొత్తాలపై తొలి ఏడాదిలో 6.60 శాతం, రెండో ఏడాది 6.7%, మూడో ఏడాది 6.9%, ఐదో ఏడాది 7.40 శాతం వడ్డీ లభిస్తుంది. 
 
​పోస్టాఫీసు మంత్లీ ఇన్ కం స్కీమ్ అక్కౌంట్ (ఎంఐఎస్)లో 7.3% వడ్డీ


​పోస్టాఫీసు మంత్లీ ఇన్ కం స్కీమ్ అక్కౌంట్ (ఎంఐఎస్)లో వడ్డీరేటు ఏడాదికి 7.3 శాతం లభిస్తుంది. ఏడాదికి ఒకసారి చెల్లించే వడ్డీరేటు నెలకొసారి చెల్లిస్తారు. గత జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని తపాలాశాఖ పేర్కొంది. 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్సెస్)లో 8.3% వడ్డీరేటు ఆఫర్


60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు మదుపు చేసుకునేందుకు తపాలాశాఖ ఆఫర్ చేసిన మదుపు పథకం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్సెస్). 2017 జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికం నాటికి అమలులో ఉన్న వడ్డీరేటే యధాతథంగా అమలువుతుంది.

15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అక్కౌంట్ (పీపీఎఫ్)లో 7.6 శాతం వడ్డీ ఆఫర్


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అక్కౌంట్ (పీపీఎఫ్)లో మదుపు చేసిన వారికి ఏటా 7.6 శాతం వడ్డీరేటు అమలులో ఉన్నది. ఇది 2018 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పీపీఎఫ్ పథకంలో వడ్డీరేటుపై జూన్ త్రైమాసికంలో కొనసాగుతుంది. 

జాతీయ పొదుపు సర్టిఫికెట్లలోనూ 7.6% వడ్డీరేటు 


2018 జనవరి ఒకటో తేదీ నుంచి జాతీయ పొదుపు సర్టిఫికెట్ల (ఎన్ఎస్‌సీ)లో పొదుపు 7.6 శాతం వడ్డీరేటు అమలులోకి వస్తుంది. ఏడాదికోసారి వడ్డీరేటు అమలవుతుంది. మెచ్యూరిటీ తేదీ ముగిసే నాటికి మాత్రమే మొత్తం సొమ్ము చెల్లిస్తారు. ఉదాహరణకు రూ.100 విలువైన ఎన్ఎస్‌సీ సర్టిఫికెట్ కొనుగోలు చేస్తే ఐదేళ్ల తర్వాత అది రూ.144.23కి చేరుతుంది. 

కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)పై 7.3 % వడ్డీ ఇలా ఆఫర్


తపాలాశాఖ ఆఫర్ చేస్తున్న మదుపు పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) ఒకటి. దీనిపై తపాలాశాఖ 7.3 శాతం వడ్డీరేటు అమలు చేస్తోంది. ఏడాదికోసారి దీన్ని లెక్కిస్తారు. ప్రతి జూన్ నెలతో ముగిసే త్రైమాసికంలో అమలు చేసే వడ్డీరేటు యథాతథంగా కొనసాగుతుంది. ఈ పథకం కింద మదుపు చేసిన మొత్తం 118 నెలల్లో (తొమ్మిదేళ్ల 10 నెలల గడువు) రెట్టింపవుతుందని తపాలాశాఖ తెలిపింది. 

సుకన్య శ్రేయస్సు ఖాతా (ఎస్ఎస్ఎ)


యువతుల కోసం తపాలాశాఖ ప్రత్యేకంగా రూపొందించిన మదుపు పథకం సుకన్య శ్రేయస్సు ఖాతా (ఎస్ఎస్ఎ). దీనిపై అత్యధికంగా 8.1 శాతం వడ్డీరేటును తపాలాశాఖ అందిస్తోంది. ఏడాదికోసారి గణిస్తారు.  

click me!