అలాంటి వార్తలు నమ్మొద్దు.. పూర్తి భరోసానందిస్తున్నాం: లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌

By Sandra Ashok KumarFirst Published Oct 6, 2020, 3:53 PM IST
Highlights

తప్పుదారి పట్టించే వార్తలను నమ్మవద్దని, బ్యాంకు నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించవలసినదిగా తమ ఖాతాదారులను లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ అభ్యర్థిస్తున్నది. 

హైదరాబాద్ అక్టోబర్‌ 6,2020: మీడియాలో ప్రస్తుతం లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) పై విభిన్నమైన వార్తలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకులో ఉన్న వాస్తవ పరిస్థితిలను తప్పుగా సూచిస్తూ వార్తలు కూడా వచ్చాయి.

ఈ తరహా పరిస్థితిలలో తప్పుదారి పట్టించే వార్తలను నమ్మవద్దని, బ్యాంకు నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించవలసినదిగా తమ ఖాతాదారులను లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ అభ్యర్థిస్తున్నది. 

ఆర్‌బీఐ ఇటీవలనే ముగ్గురు డైరెక్టర్‌లతో కూడిన కమిటీ (సీఓడీ)ని నియమించింది. వీరు బ్యాంకు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ఈ సీఓడీ యాడ్‌–ఇంట్రీమ్‌ మధ్యకాలంలో ఎండీ అండ్‌ సీఈవో విచక్షణాధికారాలను సైతం సమీక్షిస్తుంది. తమ వాటాదారులకు సంబంధించి కమిట్‌మెంట్లను తీర్చడానికి తగిన మొత్తంలో నిధులను కలిగి ఉందని ఎల్‌వీబీ స్పష్టం చేయదలుచుకుంది.

ఎలాంటి ఆలస్యమూ లేకుండా, ఎక్కడైతే ఖాతాదారులు తమ నగదును ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో అక్కడ నగదును అందించడంతో పాటుగా కాలపరిమితి తీరిన డిపాజిట్లను కూడా చెల్లించేందుకు తగిన ఏర్పాట్లను చేసింది.

వాలిడిటీ పూర్తి అయిన డిపాజిట్లను తిరిగి పునరుద్ధరించుకోవడంతో పాటుగా కొత్త ఖాతాదారులు డిపాజిట్లు చేయడం కూడా  ఈ బ్యాంకు చూస్తుంది.

also read 

ద్రవ్య లభ్యత, కొన్ని కీలకమైన లిక్విడిటీ రేషియోలను ప్రతి రోజూ నివేదికల రూపంలో ఆర్‌బీఐకు సమర్పించే బాధ్యతను  బ్యాంకు తీసుకుంది. లిక్విడిటీ కవరేజ్‌ రేషియో (ఎల్‌సీఆర్‌) 250%కు పైగా కొనసాగుతూనే ఉంది. ఇది బ్యాంకు లిక్విడిటీ స్ధాయికి సూచికగా నిలుస్తుంది.

రెగ్యులేటరీ కనీస అవసరంగా 100% ఉంటే, గుడ్ బ్యాంకులు ఈ అత్యధిక శాతం నిర్వహిస్తుంటాయి. గత వారం రోజుల కాలంలో బ్యాంకు నుంచి ఎలాంటి భారీ మొత్తాలూ బయటకు వెళ్లడం చూడలేదని బ్యాంకు స్పష్టం చేయాలనుకుంటుంది. అంతేకాదు, ఎలాంటి ఎస్సెట్స్‌–లయబిలిటీ మిస్‌ మ్యాచ్‌ కూడా బ్యాంకు చూడలేదు.

నియంత్రణ సంస్ధ (ఆర్‌బీఐ) నిధులు/లిక్విడిటీ స్థాయిని తరచుగా పర్యవేక్షిస్తూనే ఉంది. కొన్ని మీడియా సంస్థలు ప్రచురించినట్లుగా ఆందోళనకర పరిణామాలేవీ కూడా లేవు. ఈ బ్యాంకు నిబంధనల ప్రకారం 21% తమ లయబిలిటీలను ఆర్‌బీఐ వద్ద నగదు, సెక్యూరిటీల రూపంలో ఉంచింది. అంతేకాదు, కనీస అవసరాలకు మించిన రేషియోలో బ్యాంకు దీనిని నిర్వహిస్తుంది.

బుధవారం (సెప్టెంబర్‌ 30,2020) తమ టియర్‌ 2 బాండ్‌ గ్రహీతలకు వడ్డీలను ఎల్‌వీబీ చెల్లించింది. వడ్డీలు మొత్తం 15 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకూ చెల్లించాల్సిన వడ్డీలను సమయానికి చెల్లించకపోవడం అనేది బ్యాంకు చరిత్రలో లేదు.

ఈ బ్యాంకు ఇప్పుడు తాజాగా మూలధనంసేకరణ తుది దశలో ఉంది. ఈ ప్రక్రియలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే ఖచ్చితంగా ఈ మూలధన జోడింపు గురించి ప్రకటిస్తాం.  తమ డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటమే బ్యాంకు ప్రధాన బాధ్యత అని తమ డిపాజిట్లరందరికీ ఎల్‌వీబీ భరోసా ఇవ్వాలనుకుంటుంది.

మరింత సమాచారం కోసం: Adfactors PR
హరీష్ త్రీవేది – 9987218372 / harsh.trivedi@adfactorspr.com
 

click me!