మాల్యా అప్పగింత ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోంది : సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

By Sandra Ashok KumarFirst Published Oct 6, 2020, 3:23 PM IST
Highlights

 మల్యా విజ్ఞప్తిని యుకే అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించిన తరువాత విజయ్ మాల్యాని అప్పగించే చర్యలు పూర్తయినప్పటికీ, తాజా చర్యలు  భారత ప్రభుత్వానికి తెలియదు అని కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కోర్టుకు తెలిపింది.
 

లిక్కర్ డాన్  విజయ్ మాల్యాని భారత్ కు అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది. యుకేలో ప్రారంభమైన "రహస్య" చర్యల కారణంగా యునైటెడ్ కింగ్‌డమ్ (యుకే) నుండి భారతదేశానికి లిక్కర్ డాన్ విజయ్ మాల్యా రప్పించడం మళ్లీ ఆలస్యం అయిందని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

మల్యా విజ్ఞప్తిని యుకే అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించిన తరువాత విజయ్ మాల్యాని అప్పగించే చర్యలు పూర్తయినప్పటికీ, తాజా చర్యలు  భారత ప్రభుత్వానికి తెలియదు అని కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కోర్టుకు తెలిపింది.

 కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్‌ డాలర్లను బదిలీ చేయగా.. దీన్ని నేరంగా కోర్టు గతంలో ప్రకటించింది. దీన్ని సమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తూ అక్టోబర్‌ 5న తమ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు లోగడ ఆదేశాలు జారీ చేసింది.

also read 

కోర్టు విజయ్ మాల్యా తరపు న్యాయవాది అంకుర్ సైగల్ ను తాజా చర్యల పై  గురించి అడిగారు, కాని సైగల్ తన క్లయింట్ నుండి తనకు ఎటువంటి సమాచారం లేదని చెప్పాడు. జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం అంకుర్ సైగల్ స్పందనపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

"అతని తరపు న్యాయవాదిగా, మీరు పూర్తిగా అన్నీ విషయాలు తెలుసుకోవాలి. మీకు తెలియదని మీరు చెప్పకూడదు, ”అని కోర్టు వ్యాఖ్యానించింది.

యుకేలో తాజా విచారణల గురించి మాల్యా అప్పగింత ప్రక్రియ ముగియనున్న నవంబర్‌ 2 నాటికి ఈ వివరాలు తెలియజేయాలని మాల్యా న్యాయవాదికి  కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 2న వాయిదా వేసింది.
 

click me!