ఈ కాఫీ షాప్ ప్రత్యేకత ఏంటో తెలుసా.. ? ఇంటర్నెట్ సెన్సేషన్... ఎక్కడంటే..?

By Ashok kumar Sandra  |  First Published Jan 1, 2024, 6:15 PM IST

వ్యాపారంతో కళ కలిసినప్పుడే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే రెండింటినీ కలిపే కళ తెలియాలి. ప్రజల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడానికి కోల్‌కతా వ్యక్తి చేసిన పని అద్భుతం అనే చెప్పాలి. 
 


ప్రపంచంలోని ప్రతి మూలలో కళాకారులు ఉన్నారు. అయితే ఆర్టిస్టులందరినీ గుర్తించడం కష్టం. కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అవుతారు. కొంతమంది కష్టపడతారు కానీ పేరు, డబ్బు రెండూ సంపాదించడం కష్టం. మరికొందరు కళాకారులు వారి  ప్రతిభను చాలా ఆకర్షణీయంగా ఉపయోగించుకుంటారు. వారు వారి కళల ద్వారా ప్రజలను ఆకర్షించడమే కాకుండా డబ్బు కూడా సంపాదిస్తారు ఇంకా కీర్తిని కూడా పొందుతారు. ఈరోజుల్లో కళాకారులకు సరైన స్థానం లభించడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.  కళకు విలువనిచ్చే వారి సంఖ్య చాలా తక్కువ. కరోనా, లాక్ డౌన్ సహా అనేక సమస్యలు కళాకారుల పరిస్థితిని మార్చేశాయి. పరిస్థితి ఏదైనా, దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. కోల్‌కతాలోని టోలీగంజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక సాధారణ కాఫీ షాప్ యజమాని ఈ విషయాన్ని గ్రహించాడు.  

ఈ కాఫీ షాప్ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కాఫీ షాప్ ప్రత్యేకత ఏమిటంటే దాని యజమాని  క్రియేటివిటి  అండ్  డెకరేషన్. ఈ షాప్ వృత్తిరీత్యా కార్టూనిస్ట్ అండ్  స్కెచ్ ఆర్టిస్ట్ అయిన శ్యామ్ ప్రసాద్ డేకి చెందినది. అతని స్టోర్ మొత్తం, కాఫీ కప్పులు కూడా కార్టూన్‌లతో తయారు చేయబడ్డాయి. నేడు ప్రజలు వారి పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఎల్లప్పుడూ ఒత్తిడిలో పని చేస్తుంటారు. ప్రజలు ఆనందంగా ఉండాలని, ముఖంలో చిరునవ్వుతో ఉండాలని శ్యామ్ ప్రసాద్ ఈ పనికి శ్రీకారం చుట్టారు. అతను తన షాప్‌లో లభించే కప్పులతో ప్రజలను నవ్వించాలని కోరుకుంటున్నట్లు శ్యామా చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు కాఫీ విక్రయిస్తున్నాడు.

Latest Videos

దీని గురించి ఇన్‌స్టాగ్రామ్ వ్లాగర్ ఆరాధనా ఛటర్జీ ఒక వీడియో పోస్  చేశారు. శ్యామ్ ప్రసాద్ వీడియో వైరల్ కావడంతో, అతని గురించి ప్రజలకు మరింత సమాచారం వచ్చింది. అతను డేస్ బ్లూ షాప్‌లోని ప్రతి మూలను కార్టూన్‌లతో అలంకరించాడు. ఇది కాలిగ్రాఫిక్ రిఫరెన్సెస్, కార్టూన్లు ఇంకా క్లిష్టమైన డ్రాయింగ్‌ ఉంటుంది. ఇంత మంచి కార్టూన్ ఆర్టిస్ట్‌కి కాఫీ షాప్‌ పెట్టాల్సిన అవసరం ఏముందని అందరూ కోరుతున్నారు. 

కరోనా సమయంలో లక్షలాది మంది ప్రజలు కష్టాలను ఎదుర్కొన్నట్లుగా శ్యామ్ ప్రసాద్  కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. కుటుంబ జీవితం కష్టంగా ఉండేది. అతనికి కార్టూన్‌లకు సంబంధించి ఎలాంటి పని రాలేదు. అందుకే కాఫీ షాప్‌ను ప్రారంభించాడు. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ కాఫీ షాప్ లో కాఫీ మాత్రమే కాదు కార్టూన్లు ఇనాక్  సినాక్స్ కూడా కొనుగోలు చేస్తారు. కాఫీ షాప్‌కి వచ్చిన కస్టమర్లు శ్యామ్ ప్రసాద్  గీసిన కార్టూన్ల ముందు నిలబడి ఫోటోలు కూడా దిగుతున్నారు. షాప్ ప్రసాద్ కాఫీ షాప్ లో లభించే కాఫీ చాలా రుచిగా ఉంటుందని కస్టమర్లు చెబుతున్నారు. శ్యామా కార్టూన్లు కోల్‌కతా శక్తివంతమైన కథను తెలియజేస్తాయి.
 

click me!