గతేడాది లాగే కొత్త సంవత్సరం కూడా పుత్తడి ధరలు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేలకు చేరుకునే అవకాశం వుందని అంచనా. ప్రస్తుతం కమోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్‌లో పది గ్రాముల పుత్తడి ధర రూ.63,060గా వుంది.
గతేడాది లాగే కొత్త సంవత్సరం కూడా పుత్తడి ధరలు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్థిరమైన రూపాయి, భౌగోళిక , రాజకీయ అనిశ్చితులు , ప్రపంచ ఆర్ధిక వృద్ధి మందగించడం వంటి కారణాలతో దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేలకు చేరుకునే అవకాశం వుందని అంచనా. ప్రస్తుతం కమోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్‌లో పది గ్రాముల పుత్తడి ధర రూ.63,060గా వుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూఎస్ డాలర్‌తో రూపాయి 83 వద్ద ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో ఔన్స్ బంగారం 2,058 డాలర్లుగా నమోదైంది. ఈ డిసెంబర్ ప్రారంభంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతాయని అంచనా.
ఈ ఏడాది బంగారం ధర అస్ధిరంగా వుండగా.. దేశీయ మార్కెట్‌లో మే 4న 10 గ్రాములకు రూ.61,845కు .. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ ధర రూ.2,083 డాలర్లకు చేరుకుంది. నవంబర్ 16న ఎల్లో మెటల్ రికార్డు స్థాయిలో 10 గ్రాములు రూ.61,914కు చేరిందని కామ్‌ట్రెండ్జ్ రీసెర్చ్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ పీటీఐకి తెలిపారు. అనంతరం డిసెంబర్ 4న 10 గ్రాముల బంగారం ధరం రూ.64,063.. ఔన్స్ ధర 2,140 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. 2024 చివరికి ఇది 2,400 డాలర్లు చేరుతుందని అంచనా. రూపాయి స్థిరంగా వుంటే .. 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేలకు చేరుకునే అవకాశం వుంది.
కొత్త సంవత్సరంలో భారత్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) తమ పోర్ట్‌ఫోలియోలను విక్రయిస్తారనే అంచనాలతో రూపాయి బలహీనపడవచ్చని, ఇది దేశీయంగా బంగారం ధరలను మరింత పెంచుతుందని త్యాగరాజన్ పేర్కొన్నారు. కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ రీసెర్చ్ హెడ్) రవీంద్రరావు మాట్లాడుతూ.. రిటైల్ ఆభరణాల కొనుగోలు భారత్, చెైనాలలో దేశీయ ధరల పెరుగుదల కారణంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 22 సంవత్సరాల గరిష్ట స్థాయికి పెంచడంతో .. బాండ్ రాబడులు, ఏడాది పొడవునా బలమైన యూఎస్ డాలర్ కారణంగా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడిందని రవీంద్ర రావు అన్నారు.
సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు గత కొన్ని త్రైమాసికాల నుంచి భౌతిక బంగారానికి ప్రధాన డిమాండ్ ఏర్పడటానికి కారణమైంది. దేశీయంగా రికార్డు స్థాయిలో ధరలు, అసమాన రుతుపవనాలు భారతీయ ఆభరణాల వినియోగాన్ని ప్రభావితం చేశాయి. అయితే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే చైనాలో ఆర్ధిక మాంద్యం కూడా ఆభరణాల డిమాండ్ పెరుగుదలకు దారి తీసింది. Comex బంగారం కూడా మరోసారి 2,080-2,090 డాలర్ల వద్ద ప్రతిఘటనను పొందిందని రావు చెప్పారు.
ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూవెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) ఛైర్మన్ సయం మెహ్రా మాట్లాడుతూ.. బంగారం ధరలలోని అస్ధిరత అమ్మకాలపై ప్రభావం చూపిందన్నారు. 30 నుంచి 35 లక్షల వివాహాలు దేశంలో జరిగినప్పటికీ వ్యాపారం మాత్రం 2022 మాదిరిగానే సాగిందని మెహ్రా పేర్కొన్నారు. బంగారం ధరలు 2024లోనూ అమ్మకాలను మరింత ప్రభావితం చేస్తాయని తెలిపారు. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ సీఈవో సోమసుందరం మాట్లాడుతూ.. ద్రవ్యోల్భణానికి వ్యతిరేకంగా సురక్షితమైన స్వర్గధామంగా, రక్షణగా దాని పాత్రను నొక్కిచెప్పిన వివిధ కారణాల వల్ల బంగారం ధరలు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక గరిష్టాలను తాకినట్లుగా ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ త్రైమాసికంలో మాత్రం బంగారం ధర గతేడాది కంటే 12 శాతం తక్కువగా వుంది . 2023కి డిమాండ్ గతేడాది కంటే స్వల్పంగా 700 - 750 టన్నుల వద్ద వుంటుందని, బంగారంపై పెట్టుబడుల విలువ ఎక్కువగా ఉంటుందన్నారు. జెమ్ జ్యూవెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) ఛైర్మన్ విపుల్ షా మాట్లాడుతూ.. 2023 ఎగుమతిదారులకు కఠినమైన ఏడాది అన్నారు. వడ్డీ వ్యయం పెరగడం, భౌగోళిక రాజకీయ సమస్యలు, కోవిడ్ తర్వాత చైనాలో ఆర్ధిక పరిస్ధితులు వంటి బంగారం ధరలపై ప్రభావం చూపాయన్నారు.
అయితే వడ్డీ రేట్లు తగ్గే అవకాశం వున్నందున .. 2024లో పరిస్ధితులు మెరుగుపడతాయని తాము ఆశిస్తున్నామని షా పేర్కొన్నారు. భౌగోళిక , రాజకీయ సమస్యలు పరిష్కరించబడతాయని.. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను పెంచుతుందని తాము ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. చైనా మార్కెట్ కూడా కోలుకుంటుందని విపుల్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.