ఆధార్ కార్డుతో అనుసంధానించిన ఈ ప్రత్యేక ఫీచర్స్ గురించి మీకు తెలుసా..?

By S Ashok KumarFirst Published Dec 4, 2020, 6:35 PM IST
Highlights

 యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఆధార్‌కు సంబంధించిన సేవలను యుఐడిఎఐ పౌరుల ప్రయోజనం కోసం ఎప్పటికప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తూనే ఉంటుంది. 

ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమైనది. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు ఏదైనా ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ పథకాలను పొందటానికి ఆధార్ తప్పనిసరి. యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఆధార్‌కు సంబంధించిన సేవలను యుఐడిఎఐ పౌరుల ప్రయోజనం కోసం ఎప్పటికప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తూనే ఉంటుంది. పౌరులకు తెలియని ఆధార్‌కు సంబంధించిన ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆధార్ తో కొన్ని ఉపయోగకరమైన విషయాలు తెలుసుకుందాం.

ఆధార్ కార్డు నమోదు  బారత పౌరులకు పూర్తిగా ఉచితం. దీనిపై యుఐడిఎఐ కూడా గురువారం ఒక ట్వీట్ చేసింది. ఆధార్ కార్డు నమోదు ఉచితం, ఆధార్ అప్‌డేట్ చేయడానికి ఇప్పటికే ఛార్జీలు నిర్ణయించామని చెప్పారు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అదనపు మొత్తం అడిగితే, మీరు 1947 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా కాకుండా పౌరులు తమ ఫిర్యాదులను uidai.gov.in లో కూడా కంప్లైంట్ చేయవచ్చు. 

ఆధార్‌లో బయోమెట్రిక్ అప్‌డేట్స్ చేయడానికి మీరు రూ.100 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని యుఐడిఎఐ తెలిపింది. జనాభా వివరాలలో మార్పులు చేయడానికి మీరు 50 రూపాయలు మాత్రమే చెల్లించాలి.

also read 

1947 అనేది ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్, ఈ సౌకర్యం 24 గంటలు అందుబాటులో ఉంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ మీకు ఎలాంటి ఛార్జీలు వర్తించవు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐ‌వి‌ఆర్‌ఎస్) సపోర్ట్ ద్వారా ఆధార్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు కూడా లభిస్తాయి. 

గత సంవత్సరం వరకు పాలీ వినైల్ క్లోరైడ్ (పివిసి) కార్డుపై ఆధార్ కార్డు ముద్రించడం చెల్లదు కాని ఇప్పుడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పివిసి కార్డుపై ఆధార్ కార్డును ముద్రించడాన్ని ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. యుఐడిఎఐ ఈ సౌకర్యాన్ని ఇచ్చింది. మీరు ఆధార్ కార్డ్ వెబ్‌సైట్ నుండి మీకు లేదా మీ మొత్తం కుటుంబం కోసం పివిసి ఆధార్ కార్డును ఆర్డర్ చేయవచ్చు.

పివిసి ఆధార్ కార్డు ఎటిఎం కార్డు లాంటిది. నీటిలో పడిపోయిన లేదా విరిగిపోయే భయం ఉండదు. ఇవి కాకుండా కొత్త పివిసి ఆధార్ కార్డులో అనేక కొత్త భద్రతా లక్షణాలు అందించబడ్డాయి. పివిసి కార్డుపై ఆధార్ ముద్రించి ఇంటికి డెలివరీ చేయడానికి  మీరు కేవలం 50 రూపాయలు మాత్రమే చెల్లించాలి. మీ కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు ఉంటే, మీరు 250 రూపాయల రుసుము చెల్లించాలి.

click me!