జియో తెలంగాణలో ‘నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్’.. ఒక నెలపాటు కొనసాగించనున్న రోడ్డు భద్రతా కార్యక్రమాలు..

By asianet news teluguFirst Published Jan 18, 2023, 1:56 PM IST
Highlights

జియో తెలంగాణ కూడా ఉద్యోగులకు రహదారి భద్రత పై అవగాహన కల్పించడానికి అలాగే వారు పని కోసం బయటకు వెళ్లేటప్పుడు రోడ్లపై సురక్షితంగా ఉండేలా రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించింది. 
 

హైదరాబాద్, 18 జనవరి 2023: రాష్ట్రంలోని పని ప్రదేశాలన్నింటిలో జియో తెలంగాణ ‘నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్' ని నిర్వహించింది.
రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీ నుండి జనవరి 17వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం, నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ 34వ ఎడిషన్‌. ఈసారి రోడ్డు భద్రతా వారోత్సవాల ఇతివృత్తం ‘సడక్ సురక్ష - జీవన్ రక్ష’. రోడ్లపై భద్రత జీవిత దీర్ఘాయువుతో ఎలా సమానం అనే కీలక అంశం పై ప్రధాన దృష్టి ఉంటుంది.

జియో తెలంగాణ కూడా ఉద్యోగులకు రహదారి భద్రత పై అవగాహన కల్పించడానికి అలాగే వారు పని కోసం బయటకు వెళ్లేటప్పుడు రోడ్లపై సురక్షితంగా ఉండేలా రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించింది. 

ఈ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్‌లో భాగంగా రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ఫీల్డ్ టీమ్‌కి అర్థం చేసుకోవడానికి జియో అనేక కార్యక్రమాలను నిర్వహించింది. 'రహదారి భద్రత ప్రాముఖ్యత'పై సీనియర్ మేనేజ్‌మెంట్ బృందం అవగాహన సెషన్‌లను అందించింది. ఉద్యోగులందరికీ రోడ్ సేఫ్టీ సినిమా ప్రదర్శన జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా రోడ్డు భద్రతపై సేఫ్టీ ర్యాలీ నిర్వహించి పోస్టర్ ప్రదర్శన సైతం నిర్వహించారు.

కన్స్ట్రక్షన్ (Construction), నెట్‌వర్క్, ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ (O&M), సెక్యూరిటీ మొదలైన డిపార్ట్మెంట్   సభ్యులందరూ ఈ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. వీరి నుంచి వచ్చిన  అద్భుతమైన స్పందన కారణంగా జియో తెలంగాణ ఈ రోడ్డు భద్రతా కార్యక్రమాలను  ఒక నెలపాటు కొనసాగించనుంది.

click me!