హమ్మయా.. బంగారం, వెండి ధరల పరుగులకు బ్రేకులు.. ఎట్టకేలకు తులం ధర నేడు ఎంతంటే..?

By asianet news teluguFirst Published Jan 18, 2023, 10:49 AM IST
Highlights

ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.61 వద్ద కొనసాగుతోంది. ఉదయం 10:01 గంటలకు, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం 0.24 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 56,215 వద్ద ట్రేడవుతోంది, వెండి దాదాపు 0.01 శాతం తగ్గి కిలో రూ. 69,179 వద్ద ఉంది.

గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిని దాటి పరుగులు పెడుతున్న బంగారం ధరలకు నేడు బ్రేకులు పడ్డాయి. దీంతో  బుధవారం  పసిడి, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం, బంగారం రికార్డు స్థాయికి దిగువకు కదులుతుంది. 

ఈ రోజు 18 జనవరి 2023న  బంగారం ధరలు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో  స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,350, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.57,100 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,170, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,950. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,950. వెండి ధరలు  కోల్‌కతా, ముంబైలలో రూ.71,900, చెన్నైలో వెండి ధర రూ. 75,300గా ఉంది.

ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.61 వద్ద కొనసాగుతోంది. ఉదయం 10:01 గంటలకు, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం 0.24 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 56,215 వద్ద ట్రేడవుతోంది, వెండి దాదాపు 0.01 శాతం తగ్గి కిలో రూ. 69,179 వద్ద ఉంది.

0256 GMT నాటికి స్పాట్ బంగారం 0.3 శాతం తగ్గి ఔన్సుకు $1,902.79కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి $1,906.00కి చేరుకుంది. చైనీస్ ఆర్థిక గణాంకాలు 2021లో 8.1 శాతంగా ఉన్న ఆర్థిక వృద్ధి 2022లో 3 శాతానికి తగ్గడంతో విలువైన లోహాల ధరలు కూడా పడిపోయాయని అధికారిక డేటా మంగళవారం తెలిపింది.

మరోవైపు  హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు తగ్గాయి.  అయితే, ప్రముఖ నగరాల్లో  తాజాగా ధరల ప్రకారం బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950. 

హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 75,800గా ఉంది.

click me!