Jio Platforms: గ్లాన్స్‌లో జియో రూ. 1,500 కోట్ల‌ పెట్టుబడులు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 15, 2022, 12:17 PM IST
Jio Platforms: గ్లాన్స్‌లో జియో రూ. 1,500 కోట్ల‌ పెట్టుబడులు..!

సారాంశం

వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ.. తమ డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది.

వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ.. తమ డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా తమ మొబైల్ నెట్వర్క్ సేవల విభాగం “జియో” ప్లాట్‌ఫామ్ నుంచి వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది రిలయన్స్. ఈక్రమంలో ప్రముఖ డిజిటల్ కంటెంట్ సంస్థ, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత “గ్లాన్స్(glance)”లో జియో సంస్థ రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.  మొబైల్ స్క్రీన్ కంటెంట్ అందించే గ్లాన్స్ ప్లాట్ ఫామ్‌లో జియో ప్లాట్ ఫామ్స్ 17 శాతం వాటాలు కొనుగోలు చేయ‌నుంది. ఇందుకోసం 200 మిలియ‌న్ డాల‌ర్లు (సుమారు రూ. 1,500 కోట్లు) వెచ్చించ‌నుంది.  ప్రముఖ బెంగుళూరు కేంద్రంగా పనిచేసే “inmobi”కి చెందిన డిజిటల్ AI ప్లాట్‌ఫామ్ ఈ “గ్లాన్స్”. ఈ డీల్ ప్ర‌కారం గ్లాన్స్ విలువ దాదాపు 1.8 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయిలో ఉంటుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

కృత్రిమమేధ(AI) ఆధారంగా పనిచేసే “గ్లాన్స్”.. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లాక్ లో ఉన్నా సరే.. లైవ్ కంటెంట్ ను వీక్షించవచ్చు. లాక్ స్క్రీన్ లైవ్ కంటెంట్, ఈ-కామర్స్, మొబైల్ యాడ్స్ లలో గ్లాన్స్ కు అత్యధిక మార్కెట్ వాటా ఉంది. భారత్ లో అమ్ముడయ్యే 60 శాతం ఫోన్ లలో డిఫాల్ట్‌గా “గ్లాన్స్” ఇన్ స్టాల్ చేసి ఉంటుంది. శాంసంగ్, షావోమి, వివో, ఒప్పో, రియల్‌మీ వంటి ఫోన్ లలో లాక్ స్క్రీన్ ను పక్కకు జరపడంతో గ్లాన్స్ ను వీక్షించవచ్చు.

గ్లాన్స్ సంస్థలో ఇప్పటికే గూగుల్ సహా అమెరికాకు చెందిన మరికొన్ని ఆర్ధిక సంస్థలు పెట్టుబడి పెట్టాయి. ఇక ప్రస్తుతం “సీరీస్ D” రౌండ్ నిధుల సమీకరణలో ఉన్న గ్లాన్స్ లో జియో రూ.1500 కోట్లు($200 million) పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులను ఆసియ పరిధి దాటి.. పలు అంతర్జాతీయ మార్కెట్లు సహా అమెరికా, బ్రెజిల్, మెక్సికో మరియు రష్యా దేశాల్లో వ్యాపార విస్తరణకు వినియోగించనున్నారు. 

లాక్ స్క్రీన్‌కు సంబంధించి ప్ర‌పంచంలోనే అత్యంత విస్తృత స్థాయిలో లైవ్ కంటెంట్‌ను రూపొందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు గ్లాన్స్ మాతృ సంస్థ ఇన్‌మొబి గ్రూప్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, గ్లాన్స్ ప్రెసిడెంట్ పియుష్ షా తెలిపారు. జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ల‌లోని గ్లాన్స్ స‌ర్వీసులు, ఇంట‌ర్నెట్ వినియోగంలో యూజ‌ర్ల‌కు కొత్త అనుభూతి ఇవ్వ‌గ‌ల‌వ‌ని ఆయ‌న తెలిపారు. పెట్టుబడులపై జియో ప్లాట్‌ఫారమ్‌ డైరెక్టర్ ఆకాష్ అంబానీ సోమవారం మాట్లాడుతూ.. “గత రెండేళ్లలో గ్లాన్స్ అసాధారణ వేగంతో అభివృద్ధి చెందిందని, లాక్ స్క్రీన్ పై ఇంటర్నెట్, లైవ్ కంటెంట్, క్రియేటర్ ఆధారిత వినోద వాణిజ్యం మరియు గేమింగ్‌ను ఆస్వాదించడం కోసం వినియోగదారులకు ప్రత్యేకమైన పరిష్కారాన్ని అందించిందని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు