Gold and Silver Prices Today: గుడ్ న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం.. ప‌రుగులు పెడుతున్న సిల్వ‌ర్‌..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 15, 2022, 10:39 AM IST
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం.. ప‌రుగులు పెడుతున్న సిల్వ‌ర్‌..!

సారాంశం

గత రెండు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం (Gold) ధర మంగళవారం భారీగా తగ్గింది. మంగ‌ళ‌వారం (ఫిబ్ర‌వ‌రి 15, 2022) ఉదయం దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ.510 తగ్గింది. 

గత రెండు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం (Gold) ధర మంగళవారం భారీగా తగ్గింది. మంగ‌ళ‌వారం (ఫిబ్ర‌వ‌రి 15, 2022) ఉదయం దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ.510 తగ్గింది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,510కు చేరింది. మ‌రోవైపు వెండి ధ‌ర మాత్రం స్వ‌ల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర ముఖ్య నగరాల్లోనూ బంగారం, వెండి ధరల‌లో మార్పులు వచ్చాయి.

ఇకపోతే దేశ రాజ‌ధాని ఢిల్లీలో మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,300కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 50,510కు చేరింది. ఆర్థ‌క రాజ‌ధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,300 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 50,510కు చేరింది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,950కు చేరుకోగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.51,220కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 46,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 51,5100కు చేరింది.

ఇక‌పోతే.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 300కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,510కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 300కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ. 50,510కు చేరింది.


వెండి ధ‌ర‌లు
దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధ‌ర‌ రూ. 63,800కు చేరింది. ఆర్థిక రాజ‌ధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 63,800కు చేరింది. వెస్ట్ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో కిలో వెండి ధ‌ర రూ. 63, 800కు చేరింది. అలాగే చెన్నై, బెంగుళూరులో కిలో వెండి రూ. 68,600 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్‏లో కిలో వెండి ధర రూ. 68,600 దగ్గర కొనసాగుతుంది. హైదరాబాద్ లో పది గ్రాముల వెండి ధర రూ. 686 వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 68,600 వద్ద ఉండగా.. పది గ్రాముల వెండి ధర రూ. 686గా ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు