జెట్‌కు మరో దెబ్బ: సీఎఫ్‌వో అమిత్ అగర్వాల్ రాజీనామా

By Siva KodatiFirst Published May 14, 2019, 10:55 AM IST
Highlights

పీకల్లోతు కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ సీఎఫ్‌వో, డిప్యూటీ సీఈవో అమిత్ అగర్వాత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. 

పీకల్లోతు కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ సీఎఫ్‌వో, డిప్యూటీ సీఈవో అమిత్ అగర్వాత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఎన్నో ఏళ్లుగా జెట్‌తో అనుబంధం ఉన్న డిప్యూటీ సీఈవో మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సోమవారం వ్యక్తిగత కారణాల కారణంగా పదవికి రాజీనామా చేశారు. జెట్ ఎయిర్‌వేస్ సుమారు రూ. 8,500 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.

దీంతో రుణదాతలు సంస్ధను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. కాగా సంస్ధలో రుణదాతగా ఉన్న హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్... జెట్ ఎయిర్‌వేస్ కార్యాలయాన్ని మంగళవారం వేలం వేయనుంది.

ప్రారంభ ధరను రూ.245 కోట్లుగా తెలిపింది. తమకు జెట్ రూ.414.80 కోట్లు చెల్లించడంలో వైఫల్యం చెందినందున ఆ సంస్ధకు రుణాన్ని రాబట్టుకునేందుకు గాను జెట్ ఎయిర్‌వేస్ ఆస్తులను వేలం వేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా అమిత్ అగర్వాల్ 2015 డిసెంబర్‌లో జెట్ ఎయిర్‌వేస్‌లో చేరారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఆయనకు 24 ఏళ్ల అనుభవం ఉంది. జెట్ కంటే ముందు సుజ్లాన్ ఎనర్జీ, ఎస్సార్ స్టీల్ వంటి పలు సంస్ధల్లో  ఆయన సీఎఫ్‌వోగా పనిచేశారు

గత నెల రోజుల వ్యవధిలో జెట్‌లోని నలుగురు కీలక వ్యక్తులు సంస్ధను వీడారు. ఇప్పటికే ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పాతీ, మాజీ ఏవియేషన్ సెక్రటరీ, కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నసీం ఖైదీ రాజీనామా చేశారు. శాశ్వత డైరెక్టర్ గౌరాంగ్ శెట్టి జెట్ ఎయిర్‌వేస్‌కు గుడ్‌బై చెప్పారు.

click me!