జాక్‌పాట్ జీతం: ఒకేసారి ఉద్యోగి ఆకౌంట్లోకి 286 నెలల జీతం.. వెంటనే ఏం చేశాడో తెలుసా..?

Published : Jun 29, 2022, 03:19 PM IST
జాక్‌పాట్ జీతం: ఒకేసారి ఉద్యోగి ఆకౌంట్లోకి 286 నెలల జీతం.. వెంటనే ఏం చేశాడో తెలుసా..?

సారాంశం

 నివేదికల ప్రకారం, చిలీ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి ఖాతాలో 286 నెలల జీతం ఒకేసారి జమ చేయబడింది. తప్పును గ్రహించిన కంపెనీ ఆ ఉద్యోగిని సంప్రదించి  డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా ఆ ఉద్యోగి కూడా డబ్బు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించాడని.. అయితే అవకాశం చూసి మాయమైపోయాడని కంపెనీ అధికారులు చెబుతున్నారు.

ప్రతినెల 1వ తేదీ నుండి ఉద్యోగం చేసే ప్రతిఒక్కరూ జీతం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అయితే మీ బ్యాంక్ ఖాతాలో ఒక నెల  కాదు, రెండు నెలలు కాదు ఏకంగా 286 నెలల జీతం వస్తే మీరు ఏం చేస్తారు? సరే, ఇలా మీకు జరుగుతుందా లేదా అనేది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, కానీ చిలీకి చెందిన ఒక వ్యక్తికి సరిగ్గా ఇదే జరిగింది. నివేదికల ప్రకారం, చిలీ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి ఖాతాలో 286 నెలల జీతం ఒకేసారి జమ చేయబడింది. 

తమాషా ఏంటంటే.. సదరు ఉద్యోగిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కంపెనీ కోరగా.. త్వరలోనే డబ్బులు తిరిగి ఇస్తానని కంపెనీకి వాగ్దానం చేసి.. అవకాశం చూసి అదృశ్యమయ్యాడు. ఉద్యోగి ఖాతాలో 286 నెలల జీతం జమైనట్లు గ్రహించిన కంపెనీ ఆ ఉద్యోగిని సంప్రదించి  డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా ఆ ఉద్యోగి కూడా డబ్బు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించాడని.. అయితే అవకాశం చూసి మాయమైపోయాడని కంపెనీ అధికారులు చెబుతున్నారు. కంపెనీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లారనే దానిపై ఎవరికీ పెద్దగా సమాచారం లేదు. 

నివేదికల ప్రకారం, కన్సోర్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్ అనే చిలీ కంపెనీ 5 లక్షల పెసోలను (చిలీ కరెన్సీ) అంటే 7.43 కోట్ల పెసోలకు బదులుగా దాదాపు 43 వేల రూపాయలు పంపింది, అంటే భారతీయ రూపాయి ప్రకారం దాదాపు 1.42 కోట్ల రూపాయలు. కంపెనీ యాజమాన్యం  అక్కౌంట్స్ చెక్ చేయగా ఈ తప్పు వెలుగు చూసింది.  

విషయం వెలుగులోకి రావడంతో  కంపెనీ సదరు ఉద్యోగితో మాట్లాడి  అదనపు డబ్బు తిరిగి ఇవ్వాలని అడగగా.. అతను ఇవ్వలేదు. కంపెనీ ఆ ఉద్యోగి కోసం వేచి చూస్తుండగా  డబ్బుకు బదులుగా ఆ ఉద్యోగి తన రాజీనామాను  జూన్ 2న పంపాడు పంపాడు.  ఇప్పుడు ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కంపెనీ నిర్ణయించింది. 

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !