ఐటీఆర్ దాఖలు తొమ్మిది రోజులే టైం.. చేయాల్సినవీ ఇవీ

By narsimha lodeFirst Published Jun 21, 2020, 1:41 PM IST
Highlights

2019–20 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టడం మొదలు చేయకుంటే, ఈ 9 రోజుల్లోపే మొదలుపెట్టాలి. ఇందుకోసం ఐటీశాఖ కొత్త ట్యాక్స్‌‌ ఫారాల్లో ప్రత్యేక టేబుల్‌‌ ఇచ్చింది.

న్యూఢిల్లీ: 2019–20 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టడం మొదలు చేయకుంటే, ఈ 9 రోజుల్లోపే మొదలుపెట్టాలి. ఇందుకోసం ఐటీశాఖ కొత్త ట్యాక్స్‌‌ ఫారాల్లో ప్రత్యేక టేబుల్‌‌ ఇచ్చింది.

ఏప్రిల్‌‌–జూన్‌‌ మధ్య చేసిన పెట్టుబడుల గురించి ఇందులో తెలుపాలి. దీనివల్ల 2020 ఆర్థిక సంవత్సరానికి పన్ను తగ్గింపునకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యమవుతుంది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా పెట్టుబడుల వివరాలను సమర్పించేందుకు జూన్ 30 చివరి తేదీ. ఇందుకోసం ఆదాయం పన్ను శాఖ పన్నుల ఫారంలో కొత్త టేబుల్​ను జత చేసింది. ఇందులో ఏప్రిల్, జూన్​లో 2019-20కి సంబంధించి పెట్టిన పెట్టుబడుల వివరాలు సమర్పించాలి.

మామూలుగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌‌ను జూలై 31లోపు అందజేయవచ్చు. బిలేటెడ్‌‌ ఐటీఆర్‌‌ను సబ్మిట్‌‌ చేయడానికి మార్చి 31 వరకు గడువు ఉంటుంది. 

2019 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది మార్చిలోపే ఐటీఆర్‌‌ అందజేయాలి కానీ ఈ గడువును 30వ తేదీ వరకు పెంచారు. ఇది వరకు దాఖలు చేసిన దాంట్లో తప్పులు ఉంటే, మరోసారి ఐటీఆర్‌‌ను అందజేయవచ్చు.

వీలైనంత త్వరగా పబ్లిక్‌‌ ప్రావిడెంట్ ఫండ్‌‌ (పీపీఎఫ్‌‌), సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ చేయాలి. దీనివల్ల అకౌంట్లు యాక్టివ్‌‌గా ఉంటాయి. పీపీఎఫ్‌‌లో నెలకు కనీసం రూ.500లు ఇన్వెస్ట్‌‌ చేయాలి. ఎస్‌‌ఎస్‌‌వై అయితే కనీస ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ రూ.250 చేయాల్సి ఉంటుంది.

ఆధార్‌‌కార్డుతో పాన్‌‌కార్డును లింక్‌‌ చేయడానికి కూడా ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఉంది. ఈలోపు లింక్‌‌ కాకపోతే వచ్చే నెల నుంచి పాన్‌‌కార్డు పని చేయదని క్లియర్‌‌ ట్యాక్స్‌‌ సీఈఓ అర్చిత్‌‌ గుప్తా అన్నారు. ఇక నుంచి అన్ని ఫైనాన్షియల్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌కు పాన్‌‌ నంబర్  పేర్కొనడం తప్పనిసరి అని చెప్పారు.

ఏదైనా ఆస్తి కొన్నా, బ్యాంకు, డీమాట్‌‌ ఎకౌంట్‌‌ తెరిచినా పాన్‌‌ నంబరును తప్పనిసరిగా ఇవ్వాలని క్లియర్‌‌ ట్యాక్స్‌‌ సీఈఓ అర్చిత్‌‌ గుప్తా చెప్పారు. పాన్‌కార్డ్​ను ఆధార్‌తో అనుసంధానించుకోవడం  ఆదాయ పన్ను విభాగం(ఐటీ) ఇది వరకే తప్పనిసరి చేసింది.

ఇప్పటికే చాలా సార్లు గడవు పెంచిన ఐటీ శాఖ.. మరో సారి గడవు పెంచే అవకాశాలు లేకపోవచ్చు. ఇంకా మీ ఆధార్​ కార్డును, పాన్​కు అనుసంధానం చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి.
 

click me!