పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట.. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంపు, లాస్ట్ డేట్ ఇదే

By Siva KodatiFirst Published Sep 9, 2021, 8:45 PM IST
Highlights

పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గుడువును పెంచింది. ఈ మేరకు 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలు చేయడానికి  డిసెంబర్‌ 31వ తేదీ వరకు  అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ గురువారం ప్రకటించింది. 

కోవిడ్ వైరస్ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఐటీ  రిటర్నుల దాఖలు కోసం ఇన్ఫోసిస్ సంస్థ కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఇంకా పరిష్కారం కానీ నేపథ్యంలో మరోసారి రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది కేంద్రం. 

ఈ ఏడాది జూన్ 7న ఐటీ శాఖకు ఇన్ఫోసిస్ కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దీనిలో సాంకేతిక సమస్యలపై ప్రజల నుంచి పెద్ద  ఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఆర్ధిక శాఖ రంగంలోకి దిగింది. వెంటనే సమస్యలు పరిష్కరించాల్సిందిగా  ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈవో సలిల్ పరేఖ్‌కు డెడ్ లైన్ విధించారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. 

click me!