ఇన్ఫోసిస్ కీలక ప్రకటన.. త్వరలో కొత్తగా 12 వేల ఉద్యోగాలు..

By Sandra Ashok KumarFirst Published Sep 2, 2020, 5:34 PM IST
Highlights

తాజాగా వచ్చే రెండేళ్లలో 12 వేల మంది అమెరికన్ కార్మికులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. 2017లో ఇన్ఫోసిస్ రెండు సంవత్సరాలలో 10,000 మంది అమెరికన్ కార్మికులను నియమించుకోవడానికి కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు యు.ఎస్ లో 13,000 ఉద్యోగాలను సృష్టించింది. 

భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటి సంస్థ ఇన్ఫోసిస్ మంగళవారం గుడ్ న్యూస్  తెలిపింది.  గత కొంత కాలంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగ ఆర్ధిక వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ఆదాయాలు లేక కొన్ని సంస్థలు ఉద్యోగాల కోత విధించాయి.

తాజాగా వచ్చే రెండేళ్లలో 12 వేల మంది అమెరికన్ కార్మికులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. 2017లో ఇన్ఫోసిస్ రెండు సంవత్సరాలలో 10,000 మంది అమెరికన్ కార్మికులను నియమించుకోవడానికి కట్టుబడి ఉంది.

ఇందులో భాగంగా ఇప్పటి వరకు యు.ఎస్ లో 13,000 ఉద్యోగాలను సృష్టించింది. "ఇన్ఫోసిస్ 2022 నాటికి అదనంగా 12,000 మంది కార్మికులను వివిధ పోస్టులలో నియమించుకుంటుంది" అని ఒక ప్రకటనలో తెలిపింది.

"సంస్థ అనుభవజ్ఞులైన టెక్నాలజీ నిపుణులతో పాటు ప్రధాన యూనివర్సిటీలు, లిబరల్ ఆర్ట్స్ కళాశాలలు, కమ్యూనిటీ కాలేజీల నుండి గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకొని నియమించుకోవాలని చూస్తుంది. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో హెచ్1బి వీసాదారులకు వర్క్ వీసాలపై అనేక ఆంక్షలు విధించిన సమయంలో ఈ ప్రకటన వెల్లడైంది.

also read 

ఈ ఏడాది ఆరంభంలో భారతీయ ఐటి నిపుణులలో ప్రాచుర్యం పొందిన హెచ్ -1బి వీసాలు జారీ చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 2020 త్రైమాసికం ముగింపులో ఇన్ఫోసిస్‌లో 2,39,233 మంది ఉద్యోగులు ఉన్నారు.

"గత మూడేళ్లుగా యుఎస్‌లో ఉద్యోగాలు సృష్టించడంపై ఇన్ఫోసిస్ తీవ్రంగా దృష్టి సారించింది, 2022 నాటికి 12,000 మంది అమెరికన్ కార్మికులను నియమించుకోవాలన్న ఈ కొత్త నిబద్ధత మునుపటి చొరవతో విస్తరిస్తుందని నేను గర్విస్తున్నాను" అని ఇన్ఫోసిస్ సిఇఓ సలీల్ పరేఖ్ అన్నారు.

డిజిటల్ ఎకానమీ నుండి తప్పుకున్న కార్మికులకు ఇప్పుడు 21 వ శతాబ్దపు కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను పొందే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. వీసా సంబంధిత సవాళ్లను అధిగమించడానికి గత కొన్నేళ్లుగా ఐటి కంపెనీలు యుఎస్‌లో తమ ఉనికిని పెంచుకుంటూ, స్థానికులను నియమించుకుంటున్నాయని పరిశ్రమ పరిశీలకులు చెబుతున్నారు.

గత మూడేళ్లలో ఇండియానా, నార్త్ కరోలినా, కనెక్టికట్, రోడ్ ఐలాండ్, టెక్సాస్, అరిజోనా వ్యాప్తంగా ఆరు 'టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లను' అమెరికాలో ప్రారంభించినట్లు ఇన్ఫోసిస్ మంగళవారం తన ప్రకటనలో తెలిపింది.

ఈ ఇన్నోవేషన్ సెంటర్లు ప్రముఖ డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించడంలో ముందంజలో ఉన్నాయి. పెరుగుతున్న డిజిటల్ టెక్నాలజి భవిష్యత్తులో అమెరికన్ వ్యాపారాలకు తోడ్పడటానికి తరువాతి తరం ఐటి ప్రతిభకు శిక్షణ ఇస్తున్నాయి.
 

click me!