దటీజ్ ఈశా అంబానీ: నాన్నేరోల్ మోడల్.. ఆయన కల సాకారం చేస్తా

First Published Feb 21, 2019, 10:41 AM IST


ముకేశ్- నీతా అంబానీల గారాల పట్టి, పిరమాల్ కుటుంబ కోడలు ఈశా అంబానీ పిరమాల్ తన తండ్రే తనకు ఆదర్శమని పేర్కొంటున్నారు. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతూ ఆయన కలలు సాకారం చేయడమే లక్ష్యమన్నారు. తన జీవితాన్ని తాను ప్రేమిస్తానని, తన తల్లిదండ్రుల జీవితంలో మరో కోణం ఉన్నదన్న సంగతి తెలియదన్నారు. తాను షేక్స్ పియర్ సూక్తులకు ప్రాధాన్యం ఇస్తే ఆనంద్ పిరమాల్ భగవద్గీత సూక్తులు గుర్తు చేస్తుంటారని ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ తనయ ఈశా అంబానీ తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. తల్లిదండ్రుల మాదిరిగానే వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఆమె ఏనాడూ వ్యక్తిగత విషయాలను సాధారణంగా బయటపెట్టలేదు.
undefined
కానీ రెండునెలల క్రితం పిరమాల్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ను వివాహం చేసుకున్న ఈశా.. ఓ ప్రముఖ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఇంట్లో అందరూ వ్యాపారంలో కొనసాగుతున్నారు కదా! ఎవరి మధ్యైనా విభేదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఈశా అటువంటిదేమీ ఉండదని సమాధానం ఇచ్చారు.
undefined
‘అంబానీ కుటుంబ వ్యాపారం కదా అని అన్నీ మా చేతుల మీదుగానే జరగవు. ఎవరి ప్రాధాన్యం వారికి ఇస్తున్నాం. వ్యాపార భాగస్వాములను సంతృప్తి పరిస్తే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చని నాన్న నమ్మకం. నేను కూడా దాన్నే అనుసరిస్తాను. విద్యాసంస్థల్లో అవసరమైనప్పుడు అమ్మకు సాయంగా ఉంటాను. ఇటు రిలయన్స్‌లోనూ నాన్నకు తోడుగా ఉంటాను. ఆయన వ్యాపార వారసత్వాన్ని నేను కొనసాగిస్తాను. ఆయనదీ అదే కోరిక. దాన్ని నెరవేర్చడానికే కృషి చేస్తున్నా’ అని తెలిపారు.
undefined
‘వృత్తిపరంగా మాది తల్లిదండ్రులు, పిల్లల బంధం కాదు.. యజమాని, సబార్డినేట్‌ బంధం. వ్యాపార పరంగా, వ్యక్తిగత నిర్ణయాలు మా కుటుంబంలో అందరం చర్చించుకుంటాం. ఇంట్లో ఎవరు మంచి పనిచేసినా నాన్న ప్రశంసలు కురిపిస్తారు. అలాంటప్పుడు విభేధాలకు తావు ఉండదు కదా!’ అని తెలిపారు.
undefined
‘ఇంటిలో వృత్తి పరంగా కఠినంగా వ్యవహరిస్తారని వారితో ఏ విషయాన్ని పంచుకోకుండా లేను. అమ్మానాన్నల్లాగా కష్టపడే వాళ్లని నేనింత వరకు చూడలేదు. నేను ఇప్పటికీ వాళ్ల మీదే ఆధార పడుతున్నా. నా సొంతంగా ఏ నిర్ణయమూ తీసుకోలేను. చిన్నప్పటి నుంచి నన్ను కొంచెం గారాబం చేశారు. అదే విధంగా భవిష్యత్ పాఠాలు కూడా నేర్పారు’ అని పేర్కొన్నారు.
undefined
చిన్నప్పుడు ఎలా ఉన్నా.. విద్యాభ్యాసం తర్వాత భారతదేశ అవసరాలకు అనుగుణంగా రిలయన్స్ సంస్థలో మార్పులు తేవాలని భావించినట్లు ఈశా అంబానీ చెప్పారు. రోజువారీగా ఆఫీసుకు వెళ్లి రావడం అంటే నామమాత్రం కాదని తాను చేయాలనుకుంటున్నదీ చేసేస్తానని చెప్పారు. తన తండ్రి వారసత్వం, కలలను ముందుకు తీసుకెళ్లడమే తన ముందు ఉన్న లక్ష్యం అని తెలిపారు.
undefined
తాను ఆఫీసులో ఉన్నప్పుడు ఎక్కడా ఒంటరిగా నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు ఈశా అంబానీ. డేటా ఆధారంగా మేనేజ్మెంట్ బోర్డుకు జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. నైపుణ్య పరంగా సాగుతున్న జీవితంలో వ్యక్తిగత అసంత్రుప్తులకు చోటు లేదన్నారు
undefined
‘నాకు నచ్చినట్లే నా జీవితం ఉంటుంది. నా జీవితాన్ని నేను ప్రేమిస్తాను. నాకు తెలియకుండా నా తల్లిదండ్రులకు మరో జీవితం ఉందన్న సంగతి తెలియదు. జామ్ నగర్ లో చిన్నగా ఎదుగుతున్నప్పుడు గానీ, జియో ఇన్ఫో కమ్యూనికేషన్స్ ప్రారంభంలోనూ నేను అప్పుడే జన్మించినట్లు అనిపించేది. పనిలోనే సంతోషాన్ని వెతుక్కుంటా. మా అమ్మానాన్నల్లో గల అంకిత భావం, పట్టుదల గురించి నేను ఊహించుకోలేను. ఎదుగుదల పలు రూపాల్లో ఉంటుంది’ అని చెప్పారు.
undefined
‘నేను పిల్లల్లి ప్రేమిస్తా.. స్టాన్‌ఫర్డ్‌లో ఉన్నప్పుడు రెండేళ్ల పిల్లలకు పాఠాలు బోధించా.. ఈ కోర్సు పిల్లలతో స్కూల్‌లో గడిపేందుకు సమయం అవసరం. దాన్ని నేను కొనసాగిస్తూ ఎంజాయ్ చేశా.. పిల్లల ఆలోచనలను సరైన దిశలో మళ్లించడం చాలా ముఖ్యం. అయితే కొంత వరకే నేను ఆ పని చేయగలిగేదాన్ని’ అని ఈశా అంబానీ తెలిపారు.
undefined
ఇతరులకు సలహాలు ఇవ్వడానికి తాను చాలా చిన్న అమ్మాయనని పేర్కొన్న ఈశా అంబానీలో పనిలోనే శక్తి ఉంటుందని, అదే ఎవరిపైనా ఉత్తములుగా తీర్చిదిద్దుతుందన్నారు. అంతర్జాతీయంగా పురుషులతో పోలిస్తే మహిళల పాత్ర చాలా తక్కువ అని పేర్కొన్నారు.
undefined
‘మేం ఎక్కడ నుంచి వచ్చాం, మా వనరులేమిటీ అన్నది ప్రధాన అంశం కాదు. మెరుగైన దిశలో అడుగులేయడమే నాకు బెస్ట్. నేను ఆనంద్ పిరమాల్ నుంచి కొన్ని నేర్చుకున్నా. ఆయన ఎల్లవేళలా భగవద్గీత సూక్తులను కోట్ చేస్తారు. నేను షేక్స్‌పియర్ సూక్తులకు ప్రాధాన్యం ఇస్తా’ అని ఈశా అంబానీ వ్యాఖ్యానించారు.
undefined
click me!