
పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా దాదాపు ఖాళీ కావడంతో పాకిస్థాన్ రూపాయి రోజురోజుకూ పతనమవుతూ రికార్డు సృష్టిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కూడా నష్టాలతో బోరున విలపిస్తోంది. భారతీయ దిగ్గజం టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్ మొత్తం PAK స్టాక్ మార్కెట్ విలువ కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ. అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అదే సమయంలో, గౌతమ్ అదానీ కంపెనీ మార్కెట్ క్యాప్ మొత్తం పాకిస్థాన్ మార్కెట్ క్యాప్ తో సమానంగా ఉంది.
గత ఎనిమిదేళ్ల చరిత్రను పరిశీలిస్తే, పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిరంతరం తగ్గుతూనే ఉంది. మే 2017లో, PAK స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ కరాచీ స్టాక్ ఎక్స్ చేంజ్ 52,000 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్పుడు పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ విలువ 99.52 బిలియన్లకు చేరుకుంది. గత ఏడాది మే 2018లో దేశంలో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఇది 76.30 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీని తర్వాత కూడా, ఈ క్షీణత ప్రక్రియ కొనసాగింది మే 2019లో దాదాపు పావు వంతు తగ్గి 47.52 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
2020 సంవత్సరంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ విలువ 40.23 బిలియన్ డాలర్లకు తగ్గింది. అయితే, ఇది 2021లో కాస్త పెరిగి 52.05 బిలియన్లకు చేరింది. కానీ ఈ విజృంభణ కొనసాగలేదు. ఏప్రిల్ 2022 లో గత సంవత్సరం ఇది 21.83 బిలియన్ డాలర్ల కు పడిపోయింది.
ప్రస్తుతం కరాచీ స్టాక్ ఎక్స్ చేంజ్ గురించి మాట్లాడినట్లయితే, దాని విలువ ఇప్పటికీ 20 బిలియన్ డాలర్ల వరకూ వరకు ఉంటుంది. అదే సమయంలో మన దేశంలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్ కంపెనీ దాదాపు 20 బిలియన్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. అంటే అదానీకి చెందిన ఒకే ఒక్క కంపెనీ విలువ పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌తో సమానం. ఇటీవల, IMF పాకిస్తాన్ కోసం బెయిలౌట్ ప్యాకేజీని ఆమోదించిన తర్వాత, పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ యొక్క KSE-100 ఇండెక్స్ కాస్త బూమ్‌ను చూసింది.
పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ vs TCS
ఇక టాటా గ్రూప్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గురించి మాట్లాకుంటే, ప్రస్తుతం దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 147 బిలియన్లు. ఈ సంఖ్య పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ మార్కెట్ విలువ కంటే ఏడు రెట్లు ఎక్కువ. భారత రూపాయల్లో చూస్తే, TCS విలువ రూ. 12.16 లక్షల కోట్లు. TCS మాత్రమే కాదు, భారతీయ వ్యాపార రంగంలో ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి, వాటి విలువ పాక్ స్టాక్ మార్కెట్ కంటే చాలా ఎక్కువ.
పాకిస్తానీ స్టాక్ మార్కెట్ కంటే కూడా కింద పేర్కొన్న భారతీయ కంపెనీల మార్కెట్ క్యాప్ ఎక్కువగా ఉంది.
NTPC లిమిటెడ్ (మార్కెట్ క్యాప్ - 22.90 బిలియన్),
మహీంద్రా & మహీంద్రా (మార్కెట్ క్యాప్ - $ 22.48 బిలియన్లు),
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (మార్కెట్ క్యాప్ - 21.57 బిలియన్లు)