భాగ్య నగర శిఖలో మరో నగ చేరబోతున్నది. ఇంటర్నేషల్ టెక్ దిగ్గజం ఇంటెల్ హైదరాబాద్ నగరంలో చిప్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం దీన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
హైదరాబాద్ శిఖలో మరో రికార్డు నమోదు కానున్నది. ఇప్పటికే ఐటీ, ఫార్మా, మెడికల్ హబ్‌గా పేరు తెచ్చుకున్న ‘చిప్ కేంద్రం’గా నిలువనున్నది. ఇంటర్నేషనల్ టెక్నాలజీ సంస్థ ఇంటెల్ కార్పొరేషన్ హైదరాబాద్ నగర పరిధిలో పరిశోధనా అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనున్నది.
కృత్రిమ మేధ, 5జీ, అటానమస్ సిస్టమ్స్, కొత్తతరం గ్రాఫిక్స్ తదితర ఆధునిక టెక్నాలజీ రంగాలపై ఈ పరిశోధనాకేంద్రం దృష్టి సారిస్తుంది. నాలుగైదు రోజుల్లో కంపెనీ దీన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
also read సరిలేరు నీకెవ్వరు...రిలయన్స్ అరుదైన ఘనత
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ భారత దేశ ఇన్నోవేషన్ డిస్టినేషన్ కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతుందని ట్వీట్ చేశారు. నలార్‌పురియా నాలెడ్జ్ సిటీలోని నాలుగంతస్తులను ఇంటెల్ లీజుకు తీసుకుంది. ఈ కేంద్రం 1,500 మంది ఇంజినీర్లు పనిచేయడానికి వసతులు ఉంటాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఇటీవల మైక్రాన్ తన చిప్‌ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఏడాది క్రితమే హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇంటెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేంద్రం ఏర్పాటులో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. తన అమెరికా పర్యటనలో భాగంగా ఇంటెల్ ఉన్నతాధికారులను కలుసుకొని రాష్ట్రంలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గతంలో కోరారు.
also read ప్రైవేటీకరణ చేస్తేనే బతుకు లేదంటే ‘మహారాజా‘కు తాళమే: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్
ఇందులో భాగంగా ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి రాయ్.. మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పలుమార్లు చర్చించాకే ఇక్కడే నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మొదట్లో హైదరాబాద్‌కు చెందిన సెమీ కండక్టర్ డిజైనింగ్ స్టార్టప్ ఇనేడా సిస్టమ్‌ను కొనుగోలు చేసింది.
ఇనేడా సిస్టమ్‌ను దాశరధ గుడే ఏర్పాటు చేశారు. ఇదేక్రమంలో 2016లో మహేశ్ లింగారెడ్డి ఏర్పాటు చేసిన సాఫ్ట్‌మెషిన్ చిప్ డిజైనింగ్ సంస్థను కూడా వశం చేసుకున్నది. ఒప్పందం విలువ 300 మిలియన్ డాలర్లు.ఐటీతోపాటు హార్డ్‌వేర్ రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేస్తుండటం, ముఖ్యంగా టెక్నాలజీ నిపుణులు సులభంగా లభించడంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరంలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి మొగ్గుచూపుతున్నాయి.