జూలై నాటికి కంపెనీకి 1,13,700 మంది ఉద్యోగులు ఉన్నారని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తెలిపింది. మరోవైపు ఉద్యోగాల కోతపై స్పందించేందుకు ఇంటెల్ నిరాకరించింది.
చిప్‌మేకర్ ఇంటెల్ కార్ప్ పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ మందగమనం నేపథ్యంలో ఉద్యోగాల కోతకు ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ఉద్యోగాల కోత వేలల్లో ఉండవచ్చు అని దీని గురించి అవగాహన ఉన్న వారి ప్రకారం బ్లూమ్‌బెర్గ్ న్యూస్ మంగళవారం నివేదించింది.
అయితే ఈ తొలగింపులు ఈ నెలలోనే ప్రకటించనుంది. అయితే సేల్స్ అండ్ మార్కెటింగ్ గ్రూప్‌తో సహా ఇంటెల్ కొన్ని విభాగాలలో 20% మంది సిబ్బంది ఉద్యోగాల కోత ప్రభావం చూడవచ్చని నివేదిక పేర్కొంది.
undefined
జూలై నాటికి కంపెనీకి 1,13,700 మంది ఉద్యోగులు ఉన్నారని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తెలిపింది. మరోవైపు ఉద్యోగాల కోతపై స్పందించేందుకు ఇంటెల్ నిరాకరించింది.
రెండవ త్రైమాసిక ఫలితాల అంచనాలు తప్పిన తర్వాత కంపెనీ జూలైలో వార్షిక అమ్మకాలు అండ్ లాభాల అంచనాలను తగ్గించింది.
ద్రవ్యోల్బణం, ఆఫీసులు, స్కూల్స్ తిరిగి ప్రారంభించడం వలన ప్రజలు కరోనా మహమ్మారి లాక్‌డౌన్ సమయంలో చేసిన దానికంటే పర్సనల్ కంప్యూటర్ లపై తక్కువ ఖర్చు చేసేల దారితీసింది.
చిప్‌మేకర్ కంపెనీలు కూడా పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ చైనాలో COVID-19 నియంత్రణలతో ఒత్తిడికి గురవుతున్నాయి ఇంకా ఉక్రెయిన్ ఘర్షణలు సప్లయ్ చైన్ స్నార్ల్స్‌కు దారితీసింది ఇంకా డిమాండ్‌పై కూడా భారం పెంచింది.
ఇంటెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాట్ గెల్సింగర్ మంగళవారం కంపెనీ ఉద్యోగులకు ఒక మెమోను విడుదల చేశారు. అలాగే ఎక్స్ టర్నల్ కస్టమర్‌లు అండ్ కంపెనీ ప్రాడెక్ట్స్ లైన్స్ కోసం ఇంటర్నల్ ఫౌండ్రీ మోడల్‌ను రూపొందించే ప్లాన్స్ వివరించారు.
ఒక ఫౌండ్రీ బిజినెస్ ఇతర కంపెనీలు డిజైన్ చేసే చిప్‌లను నిర్మిస్తుంది. తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కో ఇందులో అగ్రస్థానంలో ఉంది. ఇంటెల్ ముఖ్యంగా ఇప్పటివరకు సొంతంగా రూపొందించిన చిప్‌లను నిర్మించింది.