ఇన్ఫోసిస్ కి షాక్... డిప్యుటీ సీఎఫ్ వో జయేశ్ రాజీనామా

By telugu teamFirst Published Oct 15, 2019, 11:54 AM IST
Highlights

ఈ ఏడిది మార్చిలో ఇన్ఫోసిస్ కంపెనీ బయ్ బ్యాక్స్ విషయంలో జయేశ్ కీలక పాత్ర పోషించారు. కాగా... జయేశ్ తన పదవి కి రాజీనామా చేయడంపై సదరు కంపెనీని ప్రశ్నించగా... వారు ఈ విషయం గురించి చర్చించడానికి ఇష్టపడలేదు. 
 

దేశీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, డిప్యుటీ సీఎఫ్ వో జయేశ్ సంఘర్జాకా తన పదవికి రాజీనామా చేశారు. గతేడాది చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎండీ రంగనాథ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా తర్వాత  తాత్కాలిక సీఎఫ్ వోగా జయేశ్ ని నియమించారు.

కాగా.. జయేశ్ గత 14 సంవత్సరాలుగా ఇదే సంస్థలో పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ లో కీలక పాత్ర పోషించిన జయేశ్ ని... రంగనాథ్ వెళ్లిపోయిన తర్వాత ఆయన బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించారు. కాగా... ఈ ఏడాది మార్చిలో భారతీ ఎయిర్ టెల్ ఎక్సిగ్యూటివ్ నిలంజన్ రాయ్ ని సీఎఫ్ వో గా నియమించారు.  కాగా.. జయేశ్ ని డిప్యుటీ సీఎఫ్ వో పదివిని అప్పగించారు.

ఈ ఏడిది మార్చిలో ఇన్ఫోసిస్ కంపెనీ బయ్ బ్యాక్స్ విషయంలో జయేశ్ కీలక పాత్ర పోషించారు. కాగా... జయేశ్ తన పదవి కి రాజీనామా చేయడంపై సదరు కంపెనీని ప్రశ్నించగా... వారు ఈ విషయం గురించి చర్చించడానికి ఇష్టపడలేదు. 

కాగా..రంగనాథ్ గతేడాది కంపెనీ నుంచి తప్పుకోగా... తాజాగా జయేశ్ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. ఇద్దురు కీలక వ్యక్తులు ఇలా కంపెనీ నుంచి వెళ్లిపోవడం ఇన్ఫోసిస్ కి పెద్ద దెబ్బే అని పలువురు భావిస్తున్నారు. 

రంగనాథ్ కన్నా ముందు కూడా పలువురు కంపెనీ నుంచి తప్పుకున్నారు. ఇన్ఫోసిస్ లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల వలసలు ఆగడం లేదు. రంగనాథ్‌కు ముందు మాజీ ప్రెసిడెంట్‌ రాజేష్‌ కృష్ణమూర్తి, సంస్థ హెల్త్‌కేర్‌ విభాగ మాజీ హెడ్‌ సంగీతా సింగ్‌, మాజీ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.

click me!