పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు.. కానీ నష్టాలను చవిచూస్తున్నాయి ఇంధన కంపెనీలు.. ఎలాగో తెలుసుకొండి

By S Ashok KumarFirst Published Mar 19, 2021, 6:17 PM IST
Highlights

నేటికీ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు  అత్యధిక స్థాయికి  చేరాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు 100 రూపాయలకు చేరుకుంది. సామాన్య ప్రజలు, ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

భారతదేశంలో ఇంధన  ధరలు ఆకాశాన్నంటాయి. నేటికీ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు  అత్యధిక స్థాయికి  చేరాయి. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు 100 రూపాయలకు చేరుకుంది. సామాన్య ప్రజలు, ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అధిక పన్ను ఉన్నందున దేశంలో చమురు ధర భారమవుతుంది అని  ప్రజలు భావిస్తున్నారు. అయితే గత 20 రోజులుగా  ఇంధన ధరలలో ఎలాంటి పెరుగుదల జరగలేదు. ధరలను సవరించకపోవడం వల్ల లీటరు పెట్రోల్‌పై నాలుగు రూపాయలు, లీటరు డీజిల్‌పై రెండు రూపాయలు నష్టపోతున్నట్లు చమురు కంపెనీలు వాపోతున్నాయి.

ముడి చమురు ధరలు ఫిబ్రవరి 26న బ్యారెల్కు 64.68 డాలర్లు ఉండగా, గత బుధవారం బ్యారెల్కు 68.42 డాలర్లకు చేరుకున్నాయి. అదనంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా 72.57 కు బలహీనపడింది. చమురు ధరలు పెంపును కొనసాగిస్తే  ముంబైలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు 103 రూపాయలకు చేరుకునేది. అలాగే దేశంలోని అనేక ఇతర నగరాల్లో  లీటరుకు రూ .100 దాటి ఉండేది.

also read వరుస క్షీణత తరువాత నేడు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 641 పాయింట్లు జంప్.. ...

 
ఇటీవల లోక్‌సభలో ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం, సెస్, సర్‌చార్జీలపై  అధికంగా లాభం పొందుతున్నట్లు తెలిపింది. 2020 మే 6 నుండి ఒక లీటరు పెట్రోల్ పై రూ .33 లాభం పొందుతోందని ప్రభుత్వం అంగీకరించింది. అలాగే ప్రభుత్వం లీటరు డీజిల్ నుంచి రూ .32 సంపాదిస్తోంది.

కాగా 2020 మార్చి నుంచి 2020 మే 5 వరకు ఇంధనం పై ప్రభుత్వ ఆదాయం లీటర్  పెట్రోల్ పై రూ .23, డీజిల్ పై రూ .19. 1 జనవరి 2020 నుండి 13 మార్చి 2020 వరకు ప్రభుత్వానికి ఒక లీటరు పెట్రోల్ నుండి రూ .20, డీజిల్ నుంచి  రూ .16 పొందుతుంది. అంటే 1 జనవరి 2020 తో పోలిస్తే ప్రభుత్వ ఆదాయం లీటరు పెట్రోల్‌కు రూ .13, డీజిల్ నుంచి 16 రూపాయలు పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో చమురు ధరలను భారీగా తగ్గించాలని  ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ వాదన
అంతకుముందు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ చమురు ధరల పై రెండు ప్రభుత్వాలు పన్ను వసూలు చేస్తున్నందున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై చేర్చించుకోవాల్సి  ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియంపై ఆదాయం వచ్చినప్పుడు అందులో 41 శాతం రాష్ట్రాలకు వెళుతుందని అన్నారు.
   

click me!