ఇండిగో ఎయిర్ లైన్స్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్.. కేవలం వారికి మాత్రమే..

Ashok Kumar   | Asianet News
Published : Jul 02, 2020, 06:16 PM ISTUpdated : Jul 02, 2020, 10:51 PM IST
ఇండిగో ఎయిర్ లైన్స్  స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్.. కేవలం వారికి మాత్రమే..

సారాంశం

"నర్సులు, వైద్యులకు విమాన ప్రయాణ చెక్-ఇన్ సమయంలో వాలిడిటీ ఉన్న హాస్పిటల్ ఐడిలను వారి గుర్తింపుగా అందించాల్సి ఉంటుంది" అని ఇండిగో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

 న్యూ ఢీల్లీ: కరోనా వైరస్ మహమ్మారిపై వ్యతిరేకంగా పోరాడుతూ ముందంజలో ఉన్నందున నర్సులు, వైద్యులకు 2020 చివరి వరకు వారికి విమాన ఛార్జీలపై 25 శాతం తగ్గింపు ఇస్తామని ఇండిగో సంస్థ ఈ రోజు తెలిపింది. "నర్సులు, వైద్యులు విమాన ప్రయాణ చెక్-ఇన్ సమయంలో వాలిడిటీ అయ్యే హాస్పిటల్ ఐడిలను వారి గుర్తింపుగా అందించాల్సి ఉంటుంది" అని ఇండిగో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

"ఇండిగో వెబ్‌సైట్ ద్వారా విమాన టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ డిస్కౌంట్ పొందవచ్చు, ఇది జూలై 01, 2020 నుండి డిసెంబర్ 31, 2020 వరకు ప్రయాణం చేసే టిక్కెట్ పై ఈ డిస్కౌంట్ చెల్లుతుంది" అని తెలిపింది. కరోనా వైరస్ లాక్ డౌన్ సడలింపుతో వీటి కార్యకలాపాలు మే 25న రెండు నెలల విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి.

జూలై 1న 785 విమానాలలో 71,471 మంది ప్రయాణికులు ప్రయాణించారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం ట్విట్టర్‌లో తెలిపారు. దీని అర్థం బుధవారం రోజున ఒక విమానంలో సగటున 91 మంది ప్రయాణికులు ఉన్నారు.

also read చైనా పై ట్రంప్ ఫైర్ : హువావే, జడ్టీఈలపై నిషేధం.. ...

సాధారణంగా ఉపయోగించే ఏ320 విమానంలో 180 సీట్లు ఉంటాయి, జూలై 1న ప్రయాణీకుల సంఖ్య చూస్తే కేవలం 50 శాతం మాత్రమే ఉంది. ఇండిగో ఈ డిస్కౌంట్ ని  "టఫ్ కుకీ" పేరుతో ప్రచారంగా చేస్తుంది.

అంతేకాదు వీరి ప్రత్యేకతను ప్రయాణంలో ప్రతి దశలో అందరూ గుర్తించేలా చేస్తుందని  వెల్లడించింది. ఇండిగో చెక్-ఇన్ వద్ద  కుకీ టిన్,  బోర్డింగ్ గేట్ వద్ద స్వాగత ప్రకటన, పీపీఈ కిట్ పై ప్రత్యేక టఫ్ కుకీ స్టిక్కర్ తోపాటు, విమానంలో వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతామని వెల్లడించింది.

PREV
click me!

Recommended Stories

Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు
Best cars Under 8Lakhs: రూ. 8 లక్షలలోపే వచ్చే బెస్ట్ కార్లు ఇవే, భారీగా అమ్మకాలు