మరో ఉద్దీపనప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. విలేకరుల సమావేశంలో ఆర్ధిక మంత్రి ఏమన్నారంటే ?

By Sandra Ashok KumarFirst Published Nov 12, 2020, 7:05 PM IST
Highlights

ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలోకి తీసుకురావడానికి మరో 2.65 కోట్ల రూపాయల సహాయ ప్యాకేజీని నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 

కరోనా సంక్షోభం, భారత దేశ లాక్ డౌన్ కారణంగా పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలోకి తీసుకురావడానికి మరో 2.65 కోట్ల రూపాయల సహాయ ప్యాకేజీని నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "ఇటీవలి గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల సంకేతాలను చూపిస్తున్నాయి. దీనితో ఆత్మ నిర్భర్ భారత్  రోజ్గర్ యోజన 3.0 ను ప్రకటించారు. దేశంలో కొత్త ఉపాధి కల్పించడానికి ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గర్ యోజనను ప్రారంభించారు.

ఇది వ్యవస్థీకృత రంగంలో ఉపాధిని పెంచుతుంది. ఇపిఎఫ్‌ఓలో చేరిన ఉద్యోగులకు ప్రయోజనం ఉంటుంది. ఇపిఎఫ్‌ఓతో సంబంధం లేనివారు లేదా మార్చి 1 నుండి సెప్టెంబర్ 30 మధ్య ఉద్యోగం కోల్పోయిన వారికి కూడా ఈ పథకంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పథకం 2020 అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తుంది అలాగే 2021 జూన్ 30 వరకు కొనసాగుతుంది. 

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లోన్ గ్యారెంటీ స్కీమ్ (ఇసిఎల్‌జిఎస్) కాలపరిమితిని పొడిగించింది. ఇప్పుడు ఈ పథకం ప్రయోజనం 31 మార్చి 2021 వరకు లభిస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్  రోజ్గర్ యోజన కింద ఇసిఎల్‌జిస్ పథకం ద్వారా 61 మిలియన్ల మంది లబ్ధి పొందుతారని తెలిపారు.

also read 

పిఎం గారిబ్ కల్యాణ్ యోజన కింద అదనంగా రూ .10 వేల కోట్లు కేటాయించారు. దీనిని ఎం‌ఎన్‌ఆర్‌ఈ‌జి‌ఏ లేదా గ్రామ రహదారి పథకం కోసం ఉపయోగించవచ్చు.రైతులకు ఎరువుల సబ్సిడీ ఇవ్వడానికి 65 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.
 
కోవిడ్ సేఫ్టీ మిషన్ కింద కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధన కోసం బయోటెక్నాలజీ విభాగానికి రూ .900 కోట్లు కేటాయించనున్నారు. తద్వారా టీకాపై పరిశోధన చేయవచ్చు. 

ప్రధానమంత్రి మత్స్య సంపాద కింద 1681 కోట్లు కేటాయించారు. నాబార్డ్ ద్వారా 25 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయించబడింది. రైల్వేలలో సరుకు రవాణా 20 శాతం పెరిగింది. బ్యాంకు రుణాల పంపిణీ 5 శాతం పెరిగింది.

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎఫ్‌పిఐ నికర పెట్టుబడి కూడా సానుకూలంగా ఉంది. జీఎస్టీ వసూలు 10 శాతం పెరిగింది. విదేశీ మారక నిల్వలు కూడా 560 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

click me!