అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కు పోటీగా రిలయన్స్ జియో మార్ట్.. ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 50% వరకు తగ్గింపు..

By Sandra Ashok KumarFirst Published Nov 11, 2020, 1:43 PM IST
Highlights

రిలయన్స్ జియో చౌక డేటా, కాలింగ్ ప్లాన్స్ ద్వారా టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన తరువాత ఇప్పుడు ఆన్‌లైన్ రిటైల్ రంగంలో కూడా పోటీదారులను తట్టుకునేందుకు వ్యూహాలు చేస్తున్నారు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ రిలయన్స్ జియో చౌక డేటా, కాలింగ్ ప్లాన్స్ ద్వారా టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన తరువాత ఇప్పుడు ఆన్‌లైన్ రిటైల్ రంగంలో కూడా పోటీదారులను తట్టుకునేందుకు వ్యూహాలు చేస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం టెలికాం రంగంలో అనుసరించిన వ్యూహాన్ని ఈ-కామర్స్ రంగంలో కూడా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ముకేష్ అంబానీ ఈ దీపావళి సందర్భంగా ఫెస్టివల్ సేల్ కూడా ప్రారంభించారు.

చాలా కాలంగా భారతదేశ ఇ-కామర్స్ మార్కెట్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో పోలిస్తే జియో మార్ట్ పెద్ద సంఖ్యలో డిస్కౌంట్ ఆఫర్లను ప్రవేశపెట్టింది.

ఎలక్ట్రానిక్స్ వస్తువుల అమ్మకాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ 50% వరకు తగ్గింపు ఇస్తుంది. ఇవి కాకుండా రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో ఫోన్‌లను కూడా చాలా తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

also read 

శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను రిలయన్స్ డిజిటల్ పోటీ వెబ్‌సైట్ల ధర కంటే 40 శాతం తగ్గింపుతో పొందవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ రంగంలో తక్కువ ధరలకు వ్యాపారం చేయడం ప్రస్తుతానికి పెద్ద సవాలు.

టెలికాం యూనిట్ రిలయన్స్ జియోలో సుమారు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడిని సంపాదించిన తరువాత ఇప్పుడు రిలయన్స్ రిటైల్ లో పెట్టుబడుదారులను ఆకర్షిస్తున్నారు.

ఇప్పటివరకు కెకెఆర్, సిల్వర్ లేక్ వంటి సంస్థల నుండి రిలయన్స్ రిటైల్ లో 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ఇ-కామర్స్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రంగంలో పట్టు సాధించడానికి ఇది ఒక సువర్ణావకాశం.

మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం 2026 నాటికి, భారతదేశంలో ఇ-కామర్స్ అమ్మకాలు 200 బిలియన్ డాలర్లను దాటవచ్చు. అయితే, టెలికాం రంగంతో పోల్చితే రిలయన్స్‌కు ఇది కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే అమెరికన్ కంపెనీలైన అమెజాన్, వాల్‌మార్ట్‌లతో నేరుగా పోటీ పడుతోంది.
 

click me!