Independence Day; 1947, ఆగస్టు 15వ తేదీన 10 గ్రాములు బంగారం ధర, 1 లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలిస్తే షాకే..

By Krishna AdithyaFirst Published Aug 15, 2022, 11:27 AM IST
Highlights

నేడు ఆగస్టు 15, దేశ స్వతంత్ర దినోత్సవం, అమృత మహోత్సవాలు జరుపుకోనుంది. ఈ 75 ఏళ్లలో  దేశంలో అనేక మార్పులు జరిగాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం రాకెట్ వేగంతో పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలన్నీ ఈ 75 ఏళ్లలో ద్రవ్యోల్బణం పెంచడం తప్ప చేసిందేమీ లేదు. దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ, 1947లో నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు వాటి ధర ఎంత అన్నది ఇక్కడ చూద్దాం.

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 'ఆజాదీ కే అమృత్‌ మహోత్సవ్‌' జరుపుకుంటున్నాం. ప్రతి ఇంటికి త్రివర్ణ పతాక ప్రచారాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా 20 కోట్ల ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత 75 ఏళ్లలో దేశం అనేక రంగాల్లో ప్రగతిని సాధించింది. 5 ట్రిలియన్ డాలర్ల  భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ, భారతదేశం వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి పథంలో ఉంది. 

బ్లూమ్‌బెర్గ్, SBI రీసెర్చ్ నివేదికలో, మాంద్యం ప్రమాదం నుండి భారతదేశం సురక్షితంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు బలమైన పునాది ఉంది. 2022-23 నాటికి భారతదేశం ఆసియాలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని మోర్గాన్ స్టాన్లీ ఇటీవల నివేదిక అంచనా వేసింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కొన్ని విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉదాహరణకు 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మీ చేతిలో ఒక్క రూపాయి ఉంటే చాలు వారం రోజులు కడుపునిండా తినొచ్చు. బియ్యం, పంచదార, బంగాళదుంపలు, పాలు, బంగారం, పెట్రోల్ ధరలు 75 ఏళ్ల క్రితం ఎంత ఉండేవో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. 

ఈరోజు 10 గ్రాముల బంగారం ధర దాదాపు 52,000 రూపాయలు. కానీ 1947లో 10 గ్రాముల బంగారం ధర 88.62 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం పెట్రో ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72 కాగా, హైదరాబాద్ లో దీని ధర రూ.109. 1947లో పెట్రోల్ ధర లీటరుకు 27 పైసలు మాత్రమే అంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు.

1947లో లీటర్ హోల్ మిల్క్ 12 పైసలు ఉంటే, నేడు లీటర్ హోల్ మిల్క్ ధర రూ.60కి చేరింది. 1947లో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లే విమాన ఛార్జీ హైదరాబాద్, విజయవాడ బస్సు ఛార్జీ కంటే తక్కువగా ఉండేది. చేతిలో 140 రూపాయలు ఉంటే, ఢిల్లీ, ముంబై మధ్య ప్రయాణించవచ్చు. ఇప్పుడు అదే దూరం విమానంలో ప్రయాణించాలంటే కనీసం 7 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.

 

వస్తువులు 1947లో     2022 లో
బియ్యం కిలో 12 పైసలు కిలో 40 రూపాయలు
చక్కెర కిలో 40 పైసలు కిలో 42 రూపాయలు
బంగాళదుంప కిలో 25 పైసలు కిలో 25 రూపాయలు
పాలు లీటరుకు 12 పైసలు లీటరుకు 60 రూపాయలు
పెట్రోలు లీటరుకు 25 పైసలు లీటరుకు 110 రూపాయలు
చక్రం  20 రూపాయలు 8 వేల రూపాయలు
విమాన టిక్కెట్ 140 రూపాయలు సుమారు 7 వేలు
10 గ్రాముల బంగారం 88.62 రూపాయలు 52 వేలు
click me!