మెటాలో తాజా రౌండ్ లేఆఫ్స్.. ఇండియాలో ఉద్యోగాలు కోల్పోయిన టాప్ ఎగ్జిక్యూటివ్స్..

By Sumanth KanukulaFirst Published May 26, 2023, 12:06 PM IST
Highlights

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా 10,000 ఉద్యోగులను తొలగించనున్నట్టుగా ఈ ఏడాది మార్చిలో ప్రణాళికను ప్రకటించిన సంగతి  తెలిసిందే.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా 10,000 ఉద్యోగులను తొలగించనున్నట్టుగా ఈ ఏడాది మార్చిలో ప్రణాళికను ప్రకటించిన సంగతి  తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగమైన మూడు-భాగాల తొలగింపులకు సంబంధించి చివరి బ్యాచ్‌ను బుధవారం ఉద్వాస‌న‌ పలకడంతో.. దాని వ్యాపార, కార్యకలాపాల విభాగాలలో ఉద్యోగాలను తగ్గించింది. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, కంటెంట్ స్ట్రాటజీ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్‌లు వంటి టీమ్‌లలో పనిచేస్తున్న డజన్ల కొద్దీ ఉద్యోగులు తమను తొలగించినట్లు లింక్డ్ఇన్‌ వేదికగా తెలియజేస్తున్నారు. 

లింక్డ్‌ఇన్ పోస్టుల ప్రకారం.. గోప్యత, సమగ్రతపై దృష్టి సారించిన దాని యూనిట్ల నుంచి కూడా ఉద్యోగులను కూడా తగ్గించింది. అయితే ఇలా ఉద్యోగాలు కోల్పోయినవారిలో ఇండియాలో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు.. మార్కెటింగ్ డైరెక్టర్ అవినాష్ పంత్,  మీడియా భాగస్వామ్య హెడ్ సాకేత్ ఝా సౌరభ్ ఉన్నారు. మెటాకు ఇండియా కీలకమైన మార్కెట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. మెటా ఈ సంవత్సరం ప్రారంభంలో 11,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆ తర్వాత రెండవ రౌండ్ మాస్ లేఆఫ్‌లను ప్రకటించిన మొదటి బిగ్ టెక్ కంపెనీగా అవతరించింది. ఈ విధంగా ఉద్యోగాల తొలగింపు.. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగాల సంఖ్యను 2021 మధ్యలో ఉన్న స్థాయికి తగ్గించాయి. 

ఇక, బలహీనమైన మార్కెట్‌లో కంపెనీ షేర్లు స్వల్పంగా పెరిగాయి. ఈ సంవత్సరం వాటి విలువ రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనకారులలో ఒకటిగా ఉన్నాయి. ఖర్చు తగ్గించే డ్రైవ్, కృత్రిమ మేధస్సుపై మెటా దృష్టి సారించింది. 

మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ మార్చిలో కంపెనీ యొక్క రెండవ రౌండ్‌లో ఎక్కువ మంది తొలగింపులు మూడు దఫాలుగా అనేక నెలలలో జరుగుతాయని చెప్పారు. ప్రధానంగా మేలో ముగుస్తుందని తెలిపారు. ఆ తర్వాత కొన్ని చిన్న రౌండ్లు కొనసాగవచ్చని ఆయన చెప్పారు. అయితే మొత్తం మీద ఉద్యోగాలలో కోతలు నాన్-ఇంజనీరింగ్ విభాగాన్ని తాకాయి. 

click me!