
2022 ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగుస్తుంది. ఆదాయపు పన్నును ఆదా చేయడానికి మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా, అయితే మీకు కొన్ని ఎంపికలు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని విధానాల ద్వారా మీ పన్నును మరింత ఆదా చేసుకోవచ్చు. మార్చి నెలాఖరులోపు మీ పెట్టుబడులను ఒకసారి చూసుకోవడం ముఖ్యం. పన్ను ఆదా కోసం అవసరమైన పెట్టుబడిని చేయకుంటే, మీరు దానిని మార్చి 31 లోగా చేసేసుకోండి. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే ఆందోళనతో ఉన్నారా, అయితే కొన్ని మార్గాలు ఇక్కడ చూద్దాం.
ఇందుకోసం 80C పరిధి పూర్తిగా ఉపయోగించుకున్నారా లేదా అనేది తనిఖీ చేయడం చాలా ముఖ్యమైన విషయం. సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
దీని కింద PPF, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, NSC,ఇద్దరు పిల్లలకు ట్యూషన్ ఫీజు, సుకన్య సమృద్ధి యోజన (SSY) మరియు మ్యూచువల్ ఫండ్‌ల పన్ను ఆదా పథకాలు వస్తాయి. మీరు గృహ రుణం తీసుకున్నట్లయితే, దాని ప్రిన్సిపల్ కూడా ఈ విభాగం పరిధిలోకి వస్తుంది.
తనిఖీ చేసుకోండి...
సెక్షన్ 80సీ కింద మీరు రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ పెట్టుబడి ఈ పరిమితి కంటే తక్కువగా ఉన్నట్లయితే, మీరు మిగిలిన మొత్తాన్ని మార్చి 31లోపు పెట్టుబడి పెట్టాలి.
ముంబయికి చెందిన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పరుల్ మహేశ్వరి మాట్లాడుతూ, "మీరు ఎంత పెట్టుబడి పెట్టారో చూసుకోవడం ముఖ్యం. మీరు చేసిన పెట్టుబడి మొత్తానికి మాత్రమే మీకు మినహాయింపు లభిస్తుంది. ఇది మీ మొత్తం పన్ను బాధ్యతను తగ్గిస్తుంది."
మీకు పీపీఎఫ్ ఖాతా ఉంటే ఏం చేయాలి?
మీకు PPF ఖాతా ఉంటే, మీరు అందులో పెట్టుబడి పెట్టారా లేదా అని తనిఖీ చేయండి. ప్రతి సంవత్సరం PPFలో కనీసం 500 రూపాయల జమచేసుకోవడం అవసరం. మీరు సుకన్య సమృద్ధి యోజన (SSY) తీసుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో కూడా కనీస బ్యాలెన్స్ అవసరం. ఇందులో కనీసం 250 రూపాయలు జమ చేయాలి.
మీ జీవిత బీమా ప్రీమియం పెండింగ్‌లో ఉంటే, మీరు దానిని చెల్లించవచ్చు. దీనితో మీ పాలసీ కొనసాగుతుంది, దీనిపై మినహాయింపు ప్రయోజనం కూడా పొందుతారు.
తొందరపడొద్దు..
అయితే పన్నులను ఆదా చేసేందుకు ప్రతిసారీ మీరు గృహ రుణం తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదా సంప్రదాయ జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఇవి దీర్ఘకాలిక పెట్టుబడులు. కాబట్టి ఆలోచించిన తర్వాత వాటి గురించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఆప్టిమా మనీ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ మత్‌పాల్ మాట్లాడుతూ, "మీరు NSCలు, మ్యూచువల్ ఫండ్‌ల పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.”
NPS కూడా మంచి ఎంపిక
మీరు 80C కింద పూర్తి పెట్టుబడిని చేసినట్లయితే, మీరు NPSలో అదనంగా రూ. 50,000 పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ 80CCG1B కింద మినహాయింపును పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ELSS పథకాలు తక్కువ రిస్క్ తీసుకునే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయి. కానీ, ఇది పెట్టుబడి స్టాక్‌లకు సంబంధించినది కాబట్టి, చాలా మంది పెట్టుబడిదారులు వీటిని రిస్క్‌గా భావించవచ్చు.
మెడిక్లెయిమ్ పాలసీతో డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు
మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరానికి రూ. 25,000 ఖర్చు చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. మీ కోసం, పిల్లలు, భార్య కోసం మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. దీని ప్రీమియం రూ. 25,000 వరకు మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేయడానికి సంవత్సరానికి రూ. 50,000 ప్రీమియంపై మినహాయింపు అనుమతి ఉంటుంది.